రోబో' హీరో కమల్ హాసన్?
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రోబో చిత్రంలో మొదట కమల్ హాసన్ నే హీరోగా అనుకున్నారుట. అందుకు తగినట్లుగానే కథ,కథనాలు రెడీ చేసుకున్నారుట. అయితే కమల్ మర్మయోగి హడావిడిలో ఈ చిత్రం చేయలేనని చెప్పారుట. దాంతో శంకర్ తన హీరో రజనీకాంత్ ని కలసి కథ వినిపించారు. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా మీడియాకు తెలియపరిచారు. ఇప్పుడు నేను నటిస్తున్న 'రోబో'లో కమల్ నటించాలి. కుదర్లేదు. శంకర్ నన్ను సంప్రదిస్తే ఇది కమల్ కోసం సిద్ధమైంది కదా నేను చేయను అన్నాను. మీకు తగ్గ విధంగా మార్పుచేర్పులు చేశామంటే అంగీకరించాను అన్నారు. ఇక కమల్ హాసన్ గురించి రజనీకాంత్ చెబుతూ నటన విషయంలో నేను చాలా వరకూ కమల్ నుంచే నేర్చుకున్నాను. మేమిద్దరం బాలచందర్ చిత్రాల్లో నటించేవాళ్లం. కమల్ సీన్ ఉన్నప్పుడు నేను పక్కకు వెళ్లి సిగరెట్ కాల్చుకొంటూ ఉండేవాణ్ని. ఓసారి బాలచందర్ పిలిచి... కమల్‌ని చూసి నేర్చుకో అన్నారు. అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











