రామ్ చరణ్ కి వదినగా కమలిని ముఖర్జీ

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కి వదినగా కమిలినీ ముఖర్జీ కనిపించబోతోంది. అన్నయ్యగా శ్రీకాంత్ చేస్తూంటే అతని సరసన కమిలిని చేస్తోంది. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 6న ప్రారంభమవుతుంది. ఇప్పటికే చరణ్‌ సరసన హీరోయిన్ గా ఇదివరకే కాజల్‌ని ఎంచుకొన్నారు.

తాజాగా శ్రీకాంత్‌ సరసన కమలినీ ముఖర్జీని ఎంపిక చేశారు. వీరిద్దరూ ఇదివరకు 'విరోధి' చిత్రంలో జంటగా నటించారు. ఇప్పుడు మరోసారి జతకట్టనున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం కమిలినీ ముఖర్జీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని అంటున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న శ్రీకాంత్ కూడా తనకు కృష్ణ వంశీ మరోసారి బ్రేక్ ఇస్తాడని భావిస్తున్నాడు. గతంలో కృష్ణవంశీ,శ్రీకాంత్ కాంబినేషన్ లో ఖడ్గం,మహాత్మా చిత్రాలు వచ్చాయి.

రామ్‌చరణ్‌కి అన్నయ్యగా కనిపించబోతున్నా అని చెప్తున్నారు శ్రీకాంత్. ఆయన తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో చిత్రం కమిటయ్యారు. వెంకటేష్ ని మొదట అనుకున్న పాత్రలో శ్రీకాంత్ వచ్చి చేరారు. ఆ పాత్రకు పెద్దగా ప్రయారిటీ లేదని అందుకే వెంకటేష్ తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకున్నారు. అది నిజమో కాదో కానీ శ్రీకాంత్ మాత్రం ఈ కొత్త పాత్రకు చాలా ఎగ్జైంటిగ్ గా ఉన్నారు.

తెలుగులో మల్టీస్టారర్‌ సినిమాలంటే గుర్తొచ్చే అతి కొద్దిమంది హీరోల్లో శ్రీకాంత్‌ ఒకరు. ఇప్పుడు ఆయన మరో మల్టీస్టారర్‌ సినిమాలో కనిపించబోతున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌, శంకర్‌దాదా జిందాబాద్‌ సినిమాల్లో చిరంజీవికి తమ్ముడిగా నటించిన శ్రీకాంత్‌ ఇప్పుడు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కి అన్నయ్యగా కనిపించబోతున్నారు.

ఈ విషయమై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాను. త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది'' అని చెప్పారు. అలాగే తమిళ, తెలుగు భాషల్లో రూపొందబోతున్న సినిమాలో శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇందులో పోలీసుగాను, విలన్ నూ రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X