కమిలినీ ఇది కరెక్టేనా?
ఆనంద్ తో పరిచయమైన కమిలినీ ముకర్జీ త్వరలో సంజయ్ దత్ తో నటించనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ న్యూస్ చెప్పింది కమిలినే అని తెలుస్తోంది. బాలీవుడ్ ఫిర్ మిలింగే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తాను చాలా కాలం తర్వాత మళ్ళీ గమ్యం రీమేక్ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నానని చెప్తోందని అంటున్నారు. అయితే ఆ చిత్రాన్ని దాసరి నిర్మిస్తారని, క్రిష్ డైరక్ట్ చేయనున్నాడనేది టాక్. అల్లరి నరేష్ చేసిన గాలి శీను పాత్రను సంజయ్ దత్ చేస్తాడని, మరో క్లాస్ హీరో శర్వానంద్ పాత్రను చేయనున్నాడని, అందుకోసం డేట్స్ కూడా అడగటం జరిగిందని కమిలినీ స్వయంగా చెప్తోంది.
అయితే ఈ విషయాలను క్రిష్ లేదా దాసరి ప్రకటిస్తే బాగుండేది అని విన్నవాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయినా ప్రస్తుతం వేదం తో బిజీగా ఉన్న క్రిష్ ఈ ప్రాజెక్టు చేపడతాడా అన్నది ప్రశ్నార్ధకమేనంటున్నారు. ఇప్పటికే గమ్యం కన్నడంలోనూ,తమిళంలోనూ రీమేక్ అయి విడుదల అయింది. రెండు చోట్లా కమిలినినే హీరోయిన్ గా తీసుకోవటం విశేషం. అలాగే కమిలిని హీరోయిన్ గా చేసిన గోపి..గోపిక..గోదావరి చిత్రం త్వరలో విడుదల కానుంది. వేణు హీరోగా ఈ చిత్రంలో ఆమె మొబైల్ డాక్టర్ గా కనిపించనుంది. వంశి దీన్ని డైరక్ట్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











