రహస్య ప్రియురాలి పాత్రలో కమిలినీ...

పోనీ బాలీవుడ్ కెళదామనుకున్నా అక్కడ అప్పటికే 'ఫిర్ మిలింగే' అంటూ సల్మాన్,అభిషేక్ బచ్చన్ లతో చేసిన సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఆమె ఫైనల్ గా మళయాళ పరిశ్రమను ఎన్నుకుంది. 'Kutyshranku అనే టైటిల్ తో షాజీ ఎన్ కరుణ్ తో సినిమా ఒప్పుకుంది. అందులో మమ్ముట్టి ప్రక్కన నటిస్తోంది.
కథ 1960 లో జరుగుతుంది. అందులో మమ్ముట్టి పడవనడుపుతూండే సాధారణ వ్యక్తి. అతను రోజూ రొటీన్ గా కేరళ లోని Kodungaloor మరియు Kollam ద్వీపాలలో తిర్గుతూంటాడు. ఈ ప్రయాణంలో అతని పరిచయాలు, ప్రజల పరిస్ధితులు గమనిస్తూంటూంటాడు. అలాగే అతని జీవితంలో ముగ్గురు రహస్య పడుతులు ఉంటారు. వారు ఒకరి కొకరు పరిచయం ఉండరు. వారంతా మొదటిసారి అతను చనిపోయినప్పుడే కలుస్తారు. ఇక ఆ రహస్య ప్రియురాళ్ళలో ఒకతిగా కమిలినీ ముఖర్జీ కనపడుతుంది.
ఆమె పేరు Pemmena. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చుపెడుతుందని ఆమె భావిస్తోంది. అలాగే ఈ ఆఫర్ ఆమెకు మరెన్నో మళయాళ అవకాళాలు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆమెకు ఫాన్ గా మారిన మమ్ముట్టి Shranku అనే డాన్స్ ప్రాధాన్యత ఉన్న చిత్రంలో అతని ప్రక్కన అవకాశమిచ్చాడు. ఇక అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా మరెన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











