twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీప్ పబ్లిసిటీ కోసమే నన్ను నగ్నంగా...కమిలినీ ముఖర్జీ మండిపాటు

    By Srikanya
    |

    కమిలినీ ముఖర్జీ తాజాగా తను నటిస్తున్నమళయాళ చిత్రం కుట్టి శ్రాంక్ దర్శకుడు షాజీ ఎన్ కరణ్ రై మండిపడుతోంది. ఆ చిత్రంలో తను నటించక పోయినా డూప్ ని పెట్టి నగ్నంగా ఉండే సీన్స్ తీసి తనను రోడ్డుపై పెడుతున్నాడని వాపోయింది. కేవలం తన చిత్రం పబ్లిసిటీ నిమిత్తం ఇలాంటి చీప్ పబ్లిసిటీకి ఒడికడతాడని ఊహించలేదంటోంది. ముమ్మట్టి హీరోగా చేసిన ఈ చిత్రంలో సన్నివేశం అంటూ నెట్ లో ఓ సీన్ విహారం చేస్తోంది. అందులో ఆమె వెనక భాగం కనపడుతుంది. అయితే అది తను కాదంటోంది కమిలినీ. ఇక యూ ట్యూబ్ లో కనిపిస్తున్న ఈ వీడియోకు మంచి డిమాండే వచ్చింది.

    అలాగే తెలుగులో ఆమెను మర్చిపోయిన దర్శక,నిర్మాతలు సైతం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ముమ్మట్టి హీరోగా చేసిన ఈ చిత్రంలో కమిలిని అతని ఇంటికి వచ్చినప్పుడు ఈ నగ్న ప్రదర్శన ఉంటుంది. ఆమె ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను చేసింది. ఆమె ముఖం చూపెడుతూ, నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని చూపెడుతూ ఈ వీడియో ఉంది. ఇంతకీ అందులో యాక్ట్ చేసింది కమిలినా లేక డూపా అన్నది ఆమే తేల్చాలి. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ..సిఐడీ మూస (మళయాళ) రీమేక్ లో చేస్తోంది. వేణు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్మెంట్ అని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X