twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం కమలిని ముఖర్జీ కెరీర్ ని వెంకటేష్ దెబ్బతీసాడా?

    By Srikanya
    |

    శేఖర్ కమ్ముల 'ఆనంద్"చిత్రంతో పరిచయం అయిన కమలిని ముఖర్జీ కి ఆ తర్వాత 'గోదావరి",'బ్రహ్మానందం డ్రామా కంపెని",'గోపీ..గోపిక..గోదావరి"వంటి చిత్రాల్లో కనిపించినా సరైన బ్రేక్ రాలేదు.చేసిన ఏ సినిమాలు హిట్లు కాక ఆమె కెరీర్ లో గోదావరిలో మునిగింది.సర్లే మరీ ఖాలీగా ఉండటం ఎందుకని..వెంకటేష్ డిజాస్టర్ చిత్రంలో 'నాగవల్లి"లో స్పెషల్ క్యారెక్టర్ చేసినా అదీ ఫలించలేదు.అయితే ఆమె ఆ పాత్ర చేయటానికి ఒప్పుకోలేదు.వెంకటేష్ స్వయంగా ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ కి ఒప్పించారు.దాంతో ఆ తర్వాత సినిమాలో వెంకటేష్ తన సరసన ఏమన్నా పాత్ర ఇస్తాడేమో అన్న భ్రమతో ఆ పాత్ర చేయటానికి ఒప్పుకుంది. కానీ సినిమానూ వర్కవుట్ కాలేదు.ఆమె ఆలోచనా సఫలం కాలేదు. సరికదా ఆమెకు అన్ని ఆ సినిమాలో చేసినటువంటి గెస్ట్ పాత్రలు,పనికిమాలిన వేషాలే వెతుక్కుంటూ వస్తున్నాయి. దాంతో అలా కంటిన్యూగా అవే చేస్తే తర్వాత తన పరిస్ధితి ఏమిటని డైలమోలో పడ్డ ఆమె వాటిని ఓకే చేయటం లేదు.

    ఆ విషయమే మాట్లాడుతూ... మంచి పాత్రలకోసం ఎదురు చూస్తున్నాను.అలా ఎదురు చూడటంలో తప్పులేదు కదా. ఎదురుచూపుల్లోనూ ఆనందం ఉంటుంది. మంచి పాత్రలు దొరికినపుడు అవి ప్రేక్షకులకు నచ్చినపుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే నేను చిన్న చిన్న పాత్రల్లో ఇమడ లేకపోతున్నాను. తెలుగులో అనేకమంది దర్శకులు నాకు అవకాశమివ్వడానికి ముందుకు వస్తున్నా పాత్రలో సరైన విషయం లేకపోవడంతో ఒప్పుకోవడంలేదు అంది. అదీ మ్యాటర్.మరీ ఖాళీగా ఉంటే ఇలా బిల్డప్ లతో మ్యాటర్ నడిపించాలి తప్పదు మరి.

    English summary
    Kamalinee Mukherjee is just for her traditional and homely roles, you are wrong! The recent Malayalam film titled, ‘Kutty Srank’ opposite Mammootty is the prime example for this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X