హీరోయిన్ కమలినీ ముఖర్జికి ఎమ్ ఎల్ ఎ పదవి!?
'ఆనంద్" చిత్రం ద్వారా కమలినీ ముఖర్జీ కథానాయికగా శేఖర్ కమ్ముల తెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత 'హ్యాపీడేస్" చిత్రంలో కూడా కమలినీ ముఖర్జీ లెక్చరర్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. తాజాగా రానా హీరో గా రూపొందుతోన్న 'లీడర్" సినిమాలో కూడా కమలిని నటించిందట. ఈ సినిమాలో ఎమ్మెల్యేగా కమలిని ఓ మంచి పాత్ర చేసిందని సమాచారం. శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆవకాయ్ బిర్యానీ" సినిమాలో కమలిని నటించలేదు.. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. మరి శేఖర్, కమలినీని సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడో ఏమో గానీ 'లీడర్" సినిమాలో ఆమెను ఏకంగా ఎమ్మల్యేను చేసారనేది. ఫ్లాష్ న్యూస్.
కమిలినీ ముఖర్జి రానా లీడర్ శేఖర్ కమ్ముల ఆనంద్ ఆవకాయ్ బిర్యానీ గోపి గోపిక గోదావరి kamalini mukherjee rana leader shekar kammula anand avakaya biryani gopi gopika godavari


Click it and Unblock the Notifications