కమిలినీ ముఖర్జీకి కొత్త చిత్రం రిలీజ్ డేట్
శేఖర్ కమ్ముల ...ఆనంద్ తో పరిచయమై గోదావరితో అందరి ఫేవరెట్ గా మారిన కమిలినీ ముఖర్జీ సినిమాలు ఈ మధ్య కాస్త స్పీడు మధ్య వేణుతో చేసిన గోపి...గోపిక..గోదావరి హిట్ టాక్ తెచ్చుకున్నా ఆమె కెరీర్ కు కిక్కివ్వలేదు. దాంతో తాజాగా ఆమె రాజశేఖర్ కాంబినేషన్ లో నటించిన చిత్రం 'మా అన్నయ్య బంగారం'. జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ "ఆరుగురు తమ్ముళ్లను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తపించిన ఓ అన్నయ్య కథ ఇది. ప్రతి సన్నివేశం ఎంతో హృద్యంగా సాగుతుంది. రాజశేఖర్ గతంలో పలు చిత్రాల్లో అన్నయ్యగా నటించారు. వాటికి భిన్నమైన రీతిలో ఉంటుందీ చిత్రంలోని పాత్ర. కమలినీ పాత్ర మహిళలను మెప్పిస్తుంద"న్నారు. "మన కుటుంబ సంప్రదాయాలకు, నేటి పరిస్థితులను జోడించి తెరకెక్కించిన చిత్రమిది" అన్నారు దర్శకుడు. కథ: భూపతిరాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, ఛాయాగ్రహణం: డి.ప్రసాదబాబు. మరి ఈ చిత్రం అయినా తిరిగి ఆమె కెరీర్ ను పట్టాలెక్కిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











