twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదట ఎయిడ్స్ తోనే..కమిలినీ ముఖర్జి

    By Srikanya
    |

    ఓ యాడ్‌లో నన్ను చూసిన నటి, దర్శకురాలు రేవతి తన 'ఫిర్ మిలేంగే' సినిమాలో శిల్పాశెట్టి చెల్లెలి పాత్రకు తీసుకున్నారు. వెండి తెర మీద అదే మొదటిసారి కనిపించడం. ఎయిడ్స్ నేపథ్యం కథతో తీసిన ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి అంటూ తన తొలి సినిమా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది కమిలిని ముఖర్జి. తాజాగా ఆమె నటించిన రామా చారి వీడో పెద్ద గూఢాచారి చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

    అలాగే శేఖర్ కమ్ముల ఆనంద్ లో ఆఫర్ వచ్చిన విధానం గుర్తు చేసుకుంటూ... "నాకు కవిత్వం రాసే అలవాటుంది. నేను రాసిన ఓ కవిత అంతర్జాతీయ కవితల పోటీకి ఎంపికైంది కూడా. అంతేకాక వాషింగ్టన్‌లో దలైలామా నిర్వహించిన సెమినార్‌కి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానం లభించిన 150 మందిలో నేనూ ఒకదాన్ని. కానీ అదే సమయంలో శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమాలో రూప పాత్రని ఆఫర్ చేశారు. దాంతో కాస్త సందిగ్ధం. చివరకి సినిమా వైపే మొగ్గుచూపా అని అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుంది. ఇక 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణుతో తను నటించిన 'రామాచారి' సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణని పొందుతుందనేది నమ్మకం వ్యక్తం చేసింది.

    English summary
    Venu, Kamalini Mukherjee starrer Ramachari has almost completed its shooting. The film has been directed by Eshwar and Shyam Prasad has produced the film. Mani Sharma has composed the music. Except for couple of songs, the rest of the shooting has been completed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X