నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో కమలినీ ముఖర్జీ..డిటేల్స్

By Srikanya

ఆనంద్ తో పరిచయమైన కమిలినీ ముఖర్జీ ఆ తర్వాత శేఖర్ కమ్ముల చిత్రాల్లో నటిస్తూ బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి,గోపిక,గోదావరి వంటి చిత్రాలు చేసింది. అయితే ఏ చిత్రమూ ఆ తర్వాత ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆమె శ్రీకాంత్ సరసన 'విరోధి" చిత్రంలో బుక్కయింది. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ జంటగా మేకా మీడియా పతాకంపై నీలకంఠ దర్శకత్వంలో అనిల్ మేకా నిర్మిస్తున్న చిత్రం 'విరోధి". ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రానికి సంబంధించిన లోగోని కృష్ణవంశీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ- 'నా మనసులో ఎప్పట్నుంచో అనుకుంటున్న ఓ మంచి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రస్తుతం సమాజంలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాన్ని నిర్మించినా నక్సలిజం మాత్రం ఎక్కడా కనపడదు. శ్రీకాంత్ సరికొత్త కథతో సరికొత్త పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఇప్పటి వర్తమాన కాలానికి ఈ చిత్రం అవసరమని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటార"ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో అజయ్, కమల్ కామరాజు, శ్రీరమ్య, రవివర్మ, శివాజీరాజా, ఆహుతి ప్రసాద్, నాగినీడు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: హెచ్.ఎం.రామచంద్ర, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, ఎడిటింగ్: శంకర్, డాన్స్: సుచిత్రా చంద్రబోస్, నిర్మాత: మేకా అనిల్, రచన, దర్శకత్వం: నీలకంఠ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X