కమలినీ కవితలూ, కాకరకాయలూ!

By Staff

ఆనంద్‌, గోదావరి చిత్రాల ఫేం కమలినీ ముఖర్జీ టేస్టులేమిటో తెలుసా? బెంగాలీ అమ్మాయి కాబట్టి చేపలంటే ఇష్టమని ఎవరైనా చెప్పవచ్చు. ఆ విషయం అటుంచితే ఆమె మంచి కవయిత్రి అన్న విషయం ఇటీవల బయటపడింది. ఆంగ్లంలో కవిత్వం రాసే కమలిని కవిత ఒక అంతర్జాతీయ పోటీలో బహుమతి కూడా పొందిందట. ఇప్పుడు ఒక కథను ఆమె రాస్తోంది. ఆ కథ ఆధారంగా బెంగాలీలో సినిమా తీయాలన్న ఆలోచన కూడా తనకు ఉందని ఆమె ఒక వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చదువుకునే రోజుల్లో రంగస్ధల నటన అనుభవం ఉన్న ఆమెకు స్క్రీన్‌ప్లే, దర్సకత్వంలో కూడా కొంత ప్రవేశం ఉందట. వాషింగ్టన్‌లో జరిగిన ఒక కవి సమ్మేళనంలో కమలినికీ, దర్శకుడు శేఖర్‌ కమ్ములకు తొలి పరిచయమైంది. అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కమలినితో సినిమా తీయాలని ఆయన ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారట. కమలిని కవిత్వానికి తొలి అభిమాని శేఖర్‌ కమ్ములేనంట.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X