వేణు తో కమిలిని?

మహర్షి సినిమా బానర్‌పై వల్లూరిపల్లి రమేష్ నిర్మించే ఈ సినిమాను ఆనందీ ఆర్ట్స్ సమర్పించనున్నది. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాయే వంశీ చివరి హిట్. అలాగే 'గమ్యం' తర్వాత హీరోయిన్‌గా అంగీకరించిన తొలి సినిమా ఇది. 'జల్సా'లో పవన్ సరసన కొద్దిసేపు కనిపించిన ఆమె ఇప్పుడు పోడుగు హీరో వేణుతో కలిసి నటించబోవటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం పాపం వేణుకు కూడా చాలా కాలమైంది హిట్టు వచ్చి...ఈ సినిమాతో దశ తిరుగుతుందేమో!!!


Click it and Unblock the Notifications











