'ఆనంద్' తో పరిచయమైన కమిలినీ ముఖర్జీ ఇప్పుడు మళయాళంలో ఒక సినిమాలో చేస్తోంది. అంతర్జాతీయంగా పేరున్నదర్శకుడు Shaji N Karun' డైరక్ట్ చేస్తున్న సినిమా అది. ఈ సినిమాలో ఆమె ముమ్మట్టి ప్రక్కన చేస్తోంది.ఇక ఆమె పాత్ర గురించామె ఇప్పటివరకూ ఇలాంటి కారెక్టర్ చేయలేదని చెప్తోంది. అందులో ఆమె తనకంటూ సొంత సెక్స్ ఆలోచనలు,భావనలు,చర్యలు గల స్ధిరమైన అమ్మయిగా చేస్తోందిట. సెక్సువాలిటీకి మరో కోణం ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించబోతున్నాని గర్వంగా చెపుతోంది. గ్యారింటీగా అవార్డులు,రివార్డులు సాధించే ఈ సినిమా తన కెరీర్ కి మంచి మలుపు ఇస్తుందని ఆశిస్తోందిట. ఇక ఆమె తమిళ 'గమ్యం' లో కూడా అదే పాత్రకు ఎంపికయింది. ఆమె హీరోయిన్ గా నటించిన 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' చీప్ సినిమా గా పేరు తెచ్చుకుని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.