బూతు సినిమా లొల్లి: హీరోయిన్‌పై దర్శకుడి కేసు
ముంబై: వాత్సాయన కామసూత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'కామసూత్ర 3డి' అనే బూతు చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా నటిస్తున్న సినిమా కావడంతో సినిమాకు బాగానే పబ్లిసిటీ వచ్చింది. ఇప్పటికే విడుదలైన షెర్లిన్ చోప్రా హాట్ అండ్ సెక్సీ ఫోటోలు, టీజర్లు సినిమాపై శృంగార ప్రియుల్లో అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు రూపేష్ పాల్, హీరోయిన్ షెర్లిన్ చెప్రా మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకునే వరకు, కోర్టులో కేసులు వేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఇటీవల షెర్లిన్ చెప్రా రూపేష్ పాల్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా...తాజాగా దర్శకుడు రూపేష్ పాల్ షెర్లిన్ చోప్రాపై ఎర్నాకులం చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేసారు.
షెర్లిన్ చెప్రా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందని రూపేష్ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాడు. రూపేష్ పాల్ కేసు స్వీకరించిన కోర్టు మార్చి 5న విచారణ జరుపనుంది. స్లైడ్ షోలో మరిన్ని ఫోటోలు, వివరాలు...

జనవరిలో షర్లిన్ ఫిర్యాదు...
దర్శకుడు రూపేష్ పాల్ తన సంతకం ఫోర్జరీ చేసాడని, కాంట్రాక్టు విషయంలో మోసం చేసాడని, తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ....అడిషనల్ కమీసనర్ ఆఫ్ పోలీస్ విశ్వాస్ నన్గారె పాటిల్ తో పాటు, ముంబైలోని శాంతాక్రజ్ సీనియర్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది షెర్లిన్.

దర్శకుడు టార్చర్ పెట్టాడంటూ ఫిర్యాదు
దర్శకుడు రూపేష్ పాల్ తన సంతకంతో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడని, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం చెల్లించకుండా మోసం చేసాడని తన ఫిర్యాదు పేర్కొంది. అతనితో పనిచేసే సమయంలో సెక్సువల్ టార్చర్ పెట్టే వాడని, అతని నిర్ణయాలకు నిరాకరిస్తే నిన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను తీసుకుంటానని బెదిరించే వాడని, అతని నుండి అసభ్యకరమైన, వల్గర్ మెయిల్స్ కూడా వచ్చే వని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. దర్శకుడు రూపేష్ పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.

గొడవ ఎలా మొదలైంది?
అయితే ఈ ఇద్ధరి మధ్య గొడవలు రావడానికి కారణం ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. సినిమా క్రెడిట్ తనకంటే తనకు దక్కేలా దర్శకుడు, హీరోయిన్ చేసిన ప్రయత్నాలే చివరకు ఈ గొడవలకు దారి తీసినట్లు చర్చించుకుంటున్నారు.

శృంగార కావ్యం
మానవ శృంగార జీవితం గురించి సవివరంగా తెలిపే ప్రముఖ భారతీయ ప్రాచీన గ్రంథం వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రియల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది. వివాదాస్పద శృంగార తార షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈచిత్రానికి కేరళకు చెందిన రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానుగుణంగా కొన్ని సీన్లలో ఆమె నగ్నంగా నటించింది.


Click it and Unblock the Notifications











