షెర్లిన్ చోప్రా ‘కామసూత్ర’3డి విడుదల తేదీ
ముంబై : ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన షెర్లిన్ చెప్రా...'కామసూత్ర' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో తన న్యూడ్ యాక్టింగుతో ప్రేక్షకులను అలరించనుంది. రూపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీ పెద్దలకు మాత్రమే.
ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి ముహూర్థం ఖరారు చేసారు. ఇందులో షెర్లిన్ చోప్రా నగ్నంగా నటించింది. స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ..... 'నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు. ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్ అంటోంది. ఈ చిత్రంలో నాజర్ కూడా నటించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాతో షెర్లిన్ చోప్రా తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉంది. కామసూత్ర 3డి అనేది ఒక భారతీయ యువరాణి కథ. వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications












