రాజకీయ దగుల్బాజీలు అంటూ సంచలనం సృష్టిస్తున్న వర్మ సాంగ్.. పవన్, జగన్, చంద్రబాబు అందరిపై!

Recommended Video

Caste Feeling Song - Kamma Rajyam Lo Kadapa Reddlu Movie - RGV

సంచలనాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ. తరచూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో ట్రెండింగ్ కావడం ఈ డైరెక్టర్ స్టైల్. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఆయన.. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ కాస్త భిన్నంగా దూసుకుపోతున్నారు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన వర్మ.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ మరో సంచలనానికి రెడీ అయ్యారు.

సరికొత్త సంచలనాలకు బాటలు వేస్తున్న వర్మ

సరికొత్త సంచలనాలకు బాటలు వేస్తున్న వర్మ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. ఊహించని విధంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ సరికొత్త సంచలనాలకు బాటలు వేస్తున్నారు వర్మ.

చెప్పినట్లుగానే.. చేసి చూపించారు

చెప్పినట్లుగానే.. చేసి చూపించారు

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఓ సాంగ్ విడుదల చేశారు. క్యాస్ట్ ఫీలింగ్ నేపథ్యంలో ఈ పాట ఉంటుందని.. ఈ పాటను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేస్తానని ముందుగానే ప్రకటించిన వర్మ.. చెప్పినట్లుగానే చేసి చూపించారు.

 నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అలా ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్. ఎవరి కులం మీద వాళ్లకున్న ప్రేమను కుల గజ్జి అనే ఒక పరమ నీచ అసహ్యమైన పేరుతో వర్ణించేవారికి ఇదే నా సమాధానం అని రామ్ గోపాల్ వర్మ వాయిస్ తో ఈ వీడియో మొదలైంది.

రాజకీయ దగుల్బాజీలు.. సంచలన పదజాలంతో

వందలాది కులాలు రాజ్యాంగ బద్దంగా ఉన్న ఈ దేశంలో కులం అడిగిన వాడు గాడిద లాంటి హిపోక్రసీ నిండిన కొటేషన్లను జనం మీద రుద్దే మీడియాలు ఉన్నప్పుడు.. కులానిది ఏముందండీ అంటూనే ఫలానా ప్రాంతంలో ఫలానా కులం వారి ఓట్లు ఎక్కువ కాబట్టి.. ఆ కులం వాడికే సీటివ్వాలనే రాజకీయ దగుల్బాజీలు ఉన్నపుడు.. అంటూ సంచలన పదజాలంతో వర్మ ఈ వీడియో వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సెన్సేషన్ అవుతోంది.

కథ ఇదేనంటూ ప్రకటన

కథ ఇదేనంటూ ప్రకటన

రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన వివరించారు.

రాజకీయ ప్రకంపనలు ఖాయం

రాజకీయ ప్రకంపనలు ఖాయం

వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. అదును చూసి ఆయన ఇస్తున్న అప్‌డేట్స్ రాజకీయ నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించేలా ఉండటంతో ఈ సినిమాపై సినీ, రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్ చర్చలు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X