వార్నింగులు ఇచ్చే కమ్మోళ్ళు ఈగలతో సమానం, దమ్ముంటే కుక్కలై అరవండి: రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కారణంగా కొంతకాలంగా వివాదాల్లో మునిగితేలున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ... ఇప్పుడు కొత్తగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా ప్రకటించి మరో వివాదాస్పద అంశానికి తెరలేపారు. వర్మ ఈ మూవీ ప్రకటించగానే ఈ సినిమా కులం కుంపట్లు రాజేస్తుందనే చర్చమొదైలంది.
ఏపీలో కమ్మ సామాజిక వర్గం లీడ్ చేసే ఓ పొలిటికల్ పార్టీ అధికారం కోల్పోవడంతో వర్మ తన వ్యాఖ్యల జోరు పెంచారు. ''ఎండలకి కాదు, రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట'' అంటూ ట్విట్టర్లో తనదైన శైలిలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు వార్నింగులు ఇచ్చే వారికి వర్మ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి
‘‘నా ఫోన్ నెంబర్ ఎక్కడో పట్టుకుని, అందరికీ షేర్ చేసి, వాట్సాప్ప్ గ్రూపుల వెనక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని నాకు వార్నింగులు ఇచ్చే కమ్మోళ్ళు, నాకు ఈగలతో సమానం... దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి... అంతేకాని దోమల్లా గీ పెట్టకండి.#KammaRajyamLoKadapaRedlu'' అంటూ ట్వీట్ చేశారు.

నా లాగా డైరెక్టుగా ఓపెన్‌గా మాట్లాడే ధైర్యం లేదా?
‘‘నా లాగా డైరెక్టుగా ఓపెన్‌గా మాట్లాడే ధైర్యం లేక సోషల్ మీడియాలో, ఫోన్లలో దాక్కుని మొరిగే మీ లాంటి పిరికిపందల వార్నింగులు వింటే నాకు ఆపుకోలేని ఆవలింతలతో కూడిన నిద్ర వస్తుంది ..గుడ్ నైట్.#KammaRajyamLoKadapaRedlu'' అంటూ వర్మ వ్యాఖ్యానించారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికైన నేపథ్యంలో విజయవాడలో తాను చూసిన కొన్ని పరిణామాల ఆధారంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రం చేయబోతున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ చిత్రంలో అందరు రాజకీయ నాయకులను చూపించబోతున్నట్లు వర్మ స్పస్టం చేశారు.

ఏపీలో విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'
కాగా.... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీలో ఎన్నికల కారణంగా నిలిచి పోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకుండా ఓ వర్గం వారు కావాలని అడ్డుకున్నారని, అప్పుడు అధికార బలంతో విజయవాడ నుంచి తరిమికొట్టారని వర్మ ఆరోపించారు. ఇపుడు ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా స్మూత్‌గా రిలీజైంది. ఈ చిత్రం చూసిన కొందరు అభిమానులు ఇది ఎన్నికల ముందు విడుదలైతే ఏపీలో ప్రతిపక్ష పార్టీకి కేవలం 5 సీట్లు మాత్రమే దక్కేవనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











