twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒట్టు... ఇది సిబిఎన్‌ గురించే, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై వర్మ తొలి అప్డేట్!

    |

    Recommended Video

    RGV's Kamma Rajyam Lo Kadapa Redlu Movie Latest Update || Filmibeat Telugu

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఆర్జీవి ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు.

    'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తొలి సాంగ్ ట్రైలర్ శుక్రవారం(ఆగస్టు 9) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్సల్ చిత్రంగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

    ఈ మూవీ కథ ఏమిటో వెల్లడించిన వర్మ

    ఈ మూవీ కథ ఏమిటో వెల్లడించిన వర్మ

    ఈ సందర్భంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీ కథ ఏమిటో కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు రాంగోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌లో జరుగబోయే అంశాలను ప్రస్తావిస్తూ సాగుతుందని స్పష్టం చేశారు. ఈ మూవీ కథలో ఎలాంటి కాంట్రవర్శీలకు తావు ఉండదని ఈ సందర్భంగా వర్మ హావీ ఇవ్వడం గమనార్హం.

    ఒట్టు... ఇది సిబిఎన్‌పై తీస్తున్న మూవీ

    ఒట్టు... ఇది సిబిఎన్‌పై తీస్తున్న మూవీ

    మరో ట్వీట్లో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఎవరిపై తీస్తున్నో కూడా స్పష్టం చేశారు. ‘ఒట్టు.. ఈ మూవీ సిబిఎన్ మీద తీస్తున్న సినిమా, మొదటి సాంగ్ ట్రైలర్ శుక్రవారం ఉదయం 9 గంటలకు రాబోతోంది, సిద్ధంగా ఉండండి' అంటూ పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడినే షార్ట్ కట్‌లో సిబిఎన్ అని పేర్కొంటూ వర్మ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

    గతంలో వెన్నుపోటు సాంగుతో షాకిచ్చిన వర్మ

    గతంలో వెన్నుపోటు సాంగుతో షాకిచ్చిన వర్మ

    గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో ‘వెన్నుపోటు' పాటను విడుదల చేసిన వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ పాటలో పదే పదే చంద్రబాబు ఫోటోలు ఫోకస్ చేయడం ద్వారా ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది ఆయనే అనే మీనింగ్ వచ్చేలా ఈ సాంగ్ చేయడం అప్పట్లో వివాదాస్పదం అయింది.

    వివాదాలు లేవంటూనే వివాదాస్పద సబ్జెక్టుతో...

    వివాదాలు లేవంటూనే వివాదాస్పద సబ్జెక్టుతో...

    రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేంద్ర బింధువు. ఆయన ప్రకటించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్‌లోనే చాలా వివాదం ఉంది. ఇలాంటిది సినిమాలో ఎలాంటి వివాదం ఉండదు అని వర్మ ప్రకటించడం కాస్త విడ్డూరంగానే ఉంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.

    English summary
    "KAMMA RAAJYAM LO KADAPA REDDLU is the story of present situation of the future in A P ..It is truly the most non controversial film ever and I swear this on CBN ..1st Song trailer release Tmrw Friday 9th at 9 Am #KRKR" RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X