సైకిల్ సంచలనం.. ఏ ఒక్క పాయింట్ వదలని వర్మ.. పప్పు సాంగ్ వైరల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాకివ్వడం కామన్‌‌ అయిపోయింది. ఈ బాటలోనే తాజాగా తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ పాత్రలపై చిత్రీకరించిన పప్పు సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ సాంగ్‌లో 'సైకిల్' గురించిన అన్ని అంశాలను ప్రస్తావించాడు వర్మ. వివరాల్లోకి పోతే..

టార్గెట్ చేశాడు.. గత ఎన్నికలకు ముందే బీజం

టార్గెట్ చేశాడు.. గత ఎన్నికలకు ముందే బీజం

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. నిజానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒక్కటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా ఈ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ ఓ వర్గం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు వర్మ.

చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్..

చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్..

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా సరికొత్త సంచలనానికి తెరలేపాలని భావించిన వర్మ.. నటీనటుల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు. ఇక వారి వారి సంచలన అప్‌డేట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ.

సైకిల్ ప్రస్తావన.. ఇన్ డైరెక్ట్‌గా పప్పులాంటి అబ్బాయి

సైకిల్ ప్రస్తావన.. ఇన్ డైరెక్ట్‌గా పప్పులాంటి అబ్బాయి

ఈ నేపథ్యంలోనే తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి 'పప్పులాంటి అబ్బాయి' పాట వీడియో సాంగ్‌ విడుదల చేశాడు. ఈ పాటలో సైకిల్ గురించి ప్రస్తావిస్తూ ఇన్ డైరెక్ట్‌గా అంతా వివరించాడు. ఇది చూసిన వారంతా చంద్రబాబు, నారా లోకేష్ గురించి, తాతనుండి సైకిల్ లాగేసున్న విధానం గురించి, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు గురించి వర్మ బాగా ఆలోచించాడని అంటున్నారు.

కాంట్రవర్సీ లేదంటూనే.. మరో అడుగు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే తాను ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చెలామణి అనుకోవడం లేదని చెబుతూ వస్తున్నాడు వర్మ. పైగా విడుదల చేసిన ప్రతీ పోస్టర్, ప్రతీ పాటపై ఇది ఎవరినానైనా పోలి ఉందని భావిస్తే అది పూర్తిగా మీ అభిప్రాయం అని చెప్తున్నాడు. దీంతో వర్మ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెన్సేషన్స్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెన్సేషన్స్

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. రాజకీయ వర్గాలను కుదిపేస్తూ వర్మ విడుదల చేస్తున్న అప్‌డేట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X