రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తీసిన సన్నివేశాల రషెష్ చూసిన శేఖర్..తను సంతృప్తి చెందలేదని భావించి ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ముందుగా ప్రచారం జరిగినట్లు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరగటం లేదు.ఓ రాజకీయకుటుంబంలో జరిగే సంఘటనలు, వాటితో హీరో ఎలా ప్రభావితుడవుతాడు, తన వారసత్వ ఫంధాని మార్చుకుని సమాజానికి ఎలా ఉపయోగపడే వ్యక్తిగా రూపాంతరం చెందుతాడన్నది ప్రధాన అంశంగా నడుస్తుందని తెలుస్తోంది. ఇక శేఖర్ ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్నారు. ఎంతసేపు రొమాంటిక్ కామిడిలే కాకుండా సామాజిక నేఫద్యం ఉన్న సినిమాలు కూడా తాను తీయగలనని నిరూపిస్తాడని ఆయన శ్రేయాభిలాషులు అంటున్నారు. ఏదైమైనా హ్యాపీడేస్ లాంటి మరో హిట్టు రావాలని కోరుకుందాం.