వేధించిన వారిని పట్టించిన కామ్మా జట్మలానీ
ముంబై అంధైరిలో సినిమా చూసి వస్తూ బోరవెల్లి రోడ్డులో వస్తూండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి వంటిగంటన్నర సమయంలో ఈ ఈవ్ టీజింగ్ జరిగింది. కానీ చివరకు ఆమె వారిని పోలీసులుకు పట్టించింది. ఆమె వారి కారు నెంబర్ నోట్ చేసుకోవటంతో పోలీసులుకు క్లూ దొరికి వారిని పట్టుకోవటం సాధ్యమైంది. దాదాపు నలభై నిముషాలు పాటు ఈ ఛేజ్ జరిగిందని ఆమె తెలియచేసింది. నా జీవితంలో నేను ఎంత భయపడ్డానో నోటి తో చెప్పలేను అంది. ఆడవాళ్లకు వీధిల్లో స్వేచ్చ లేని ఈ దేశంలో బ్రతకటం చాలా కష్టమని అంది.
ఇక కామ్నా జట్మలాని తెలుగులో చివరగా ..అల్లరి నరేష్ కత్తుల కాంతారావు చిత్రంలో చేసింది. అల్లరి నరేష్ తన తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేసాడు. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ 'ఎవర్నయినా మడతెట్టేస్తాడు'అని. ఫన్నీగా ఉండేలా పెట్టినా ఈ ట్యాగ్ లైన్ నిజ జీవితంలో అల్లరి నరేష్ క్యారెక్టర్ కి సరిపోతుందంటూ ఈ చిత్రాన్ని హిట్ చేసారు. బెండు అప్పారావులో తన సరసన చేసిన కామ్నా జట్మలానిని మళ్ళీ తీసుకునేలా తన తండ్రిని ఒప్పించిన మడితెట్టేసే కళ గొప్పదే అని చెప్పుకున్ననారు. నరేష్ తో ఒక్కసారి చేసిన హీరోయిన్ తో అతను అల్లరి చేసి ఆ తర్వాత ఆమెను తన సినిమాలో లిప్ట్ ఇవ్వటం కామన్ అంటున్నారు. మొన్న ఫర్జానా,నిన్న మంజరి,ఈ రోజు కామ్నా జఠ్మలాని అని చెప్తున్నారు. అందులోనూ నరేష్ చేసేవి చిన్న సినిమాలే అయినా వరసగా ఆఫర్స్ ఉండటంతో అతన్ని మంచి చేసుకోవటానికి హీరోయిన్స్ ముందుంటారు.


Click it and Unblock the Notifications












