నాకు ఇంకా పెళ్లి కాలేదు మొర్రో..
అల్లరి నరేష్ తో నాలుగైదు సినిమాల్లో హీరోయిన్‌గా, పలు చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో కనిపించిన నటి కామ్నా జఠ్మలానీ ఈ మధ్య తెలుగు సినిమాల్లో బొత్తిగా కనిపించడమే లేదు. టాలీవుడ్ సర్కిల్ లో ఆమెకు పెళ్లి రహస్యంగా అయిందనే వార్తలు కూడా విపిస్తున్నాయి. దీంతో గతంలో ఆమెకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఆమె గురించి ఆలోచించడమే మానేశారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ....తనకు ఇంకా పెళ్లి కాలేదని, మ్యారేజ్ విషయంలో వినిపిస్తున్న పుకార్లను నమ్మ వద్దని వేడుకుంటోంది.
ఇలాంటి ప్రచారం మూలంగా తనకు అవకాశాలు రావడం లేదని, దర్శక నిర్మాతలు అకాశాలు కల్పించాలని కోరుతోంది. ఇంటర్నెట్‌లో తన గురించి ఫేక్ ప్రచారం సాగుతోందని వెల్లడించింది. కామ్నా చివరి సారిగా 2010లో తెలుగులో అల్లరి నరేష్‌తో కత్తి కాంతారావు చిత్రంలో నటించింది. గత సంవత్సరం ఓ మలయాళ చిత్రంలో అతిథి పాత్రలో, తమిళంలో ఓ సినిమాలో నటించింది. ప్రస్తుతం కామ్నా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. మరి అవకాశాలు లేక అల్లాడి పోతున్న కామ్నాకు ఆపన్న హస్తం అందించేది ఎవరో? ఏమిటో...


Click it and Unblock the Notifications











