కామ్నా జఠ్మలాని రహస్య వివాహం(ఫొటో)
హైదరాబాద్: ప్రేమికులు చిత్రంతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ కామ్నా జఠ్మలాని. ఆమె చాలా సినిమాలు చేసింది కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఇండస్ట్రీ వారికి,మీడియాకు ఆ విషయం చెప్పలేదు. ఎనిమిది నెలల క్రితం ఆమె బెంగుళూరు కి చెందిన
సూరజ్ అనే మెకానికల్ ఇంజినీర్ ని వివాహం చేసుకుంది. మీరు ఫొటోలో చూస్తున్నది అతని ఫొటోనే. ఓ ఇనాగరేషన్ ఈవెంట్ కు వచ్చిన ఆమె స్వయంగా ఈ విషయం తెలియచేసింది.

కామ్నా మీడియాతో మాట్లాడుతూ... "అవును, నేను వివాహం చేసుకున్నాను... ఎనిమిది నెలల క్రితమే పెళ్లైంది. సూరజ్ అనే వ్యక్తితో ఎరేంజెడ్ మ్యారేజ్ జరిగింది. మా అత్త మామలు బెంగళూరులో ఉంటారు. నేను నా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలు చేయటానికి సమయం దొరటం లేదు. ", అంటూ చెప్పుకొచ్చారామె. వన్ ఇండియా తెలుగు ఆమెకు వైవాహిక శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











