Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నాగ్ సరసన అల్లరి నరేష్ హీరోయిన్
హైదరాబాద్ : అల్లరి నరేష్ తో ... బెండు అప్పారావు ఆర్.ఎం.పి,కత్తుల కాంతారావు చిత్రాలు చేసిన కామ్నా జట్మలాని గుర్తుండే ఉంటుంది. పెద్ద హీరోలు ఎవరితో అవకాసాలు అందిపుచ్చుకోలేక ఫేడ్ అవుట్ అయిపోయిన ఆమెకు నాగార్జున సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం. నాగార్జున తాజా చిత్రం భాయ్ లో ఆమె ఓ కీ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. అందులో ఆమె నాటీ గర్ల్ గా కనిపించనుంది.
భాయ్ చిత్రాన్ని వీరభద్ర చౌదరి డైరక్ట్ చేస్తున్నారు. వీరభద్రం గతంలో అహనా పెళ్లంట,పూల రంగడు చిత్రాలు డైరక్ట్ చేసాడు. యాక్షన్ కామెడీగా ఈ భాయ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు.
నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.
అలాగే నాగార్జున కూడా 'భాయ్' సబ్జెక్ట్ పట్ల చాలా సంతోషంగా వున్నారని, తన కెరీర్లో వైవిధ్యమైన హాస్య చిత్రం చేయబోతున్నానని ఆయన ప్రశంసించినట్లు వీరభవూదమ్ తెలిపారు. 'హాలో బ్రదర్' తరహాలో సినిమా వుంటుంది కానీ నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం లేదని ఆయన అన్నారు. రిచాగంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.