twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామ్నా లైన్ లో నరేష్?

    By Staff
    |

    Kamna Jetmalani
    కామ్నా జఠ్మలాని..అల్లరి నరేష్ ప్రేమంటూ వెంటబడుతూ రెచ్చకొడుతోంది. తాజాగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోన్న బెండు అప్పారావు ఆర్.ఎం.పి అనే చిత్రంలో ఈ తరహా సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. గోదావరి జిల్లా పల్లె నేపధ్యంలో పూర్తి స్దాయి కామెడీతో నడిచే ఈ చిత్రంలో సెంటిమెంట్ హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్ ఓ ప్రెవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా కన్పించి నవ్వులు పంచనున్నాడు. ఇక మహిళా దర్శకరాలు బి.జయ చేయాలనుకున్న సినిమా ఇదే నని కొన్ని పరిస్ధితుల్లో డైరక్టర్ ని మార్చారని, స్క్రిప్టు అదేనని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక జనార్ధన మహర్షి శిష్యుడు గిరి అందించిన కథకు వెలగొండ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఫిటింగ్ మాస్టర్ అనంతరం ఇ.వి.వి. తిరిగి తన స్కూల్ లోకి వెళ్ళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కామ్నా జఠ్మలాని కూడా మొహమాటపడకుండా తన అందాలను ఆరబోస్తోందని వినపడుతోంది.

    ఇక బి.జయను ప్రాజెక్టు నుంచి తప్పించి సురేష్ ప్రొడక్షన్స్ వారు ఇవివికి ఈ సినిమా ఇవ్వటంపై పలు కథనాలు వినపడ్తున్నాయి. ఇవివి ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫిటింగ్ మేస్టర్ సినిమా నిమిత్తం సురేష్ బాబుకి దాదాపు రెండు కోట్ల దాకా బాకీ పడ్డాడని, దాన్ని తీర్చటానికే ఇలా కమిట్ అయ్యారంటున్నారు. ఇవివి దర్శకత్వానికి యాభై లక్షలు, నరేష్ నటనకి యాభై లక్షలు చొప్పున లెక్క కట్టి ఈ సినిమా చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. పక్కా బిజెనెస్ మెన్ అయిన సురేష్ బాబు ఇలా తన బాకీ తీర్చుకునే అవకాశాన్ని ఆ తండ్రి కొడుకులకు ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఇవివి చేతిలో ఒక్క సినిమా లేకపోవటం, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ లో సినిమా అవటంతో నరేష్ సంతోషంగా రెమ్యునేషన్స్ కాదనుకుని ఇలా చేస్తున్నారనేది టాక్. బెస్ట్ ఆఫ్ లక్ నరేష్ అండ్ టీమ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X