సుశాంత్ సూసైడ్.. బాలీవుడ్ వివాదంలోకి పూరీ జగన్నాథ్‌ను లాగిన కంగన రనౌత్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో చెలరేగుతున్న వివాదాలపై నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందిస్తున్నారు. సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్‌లోని సూసైడ్ గ్యాంగే కారణం అంటూ మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖులను టార్గెట్ చేశారు. సుశాంత్ సూసైడ్, బాలీవుడ్‌లో నెపోటిజంపై ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్‌లో అర్నబ్ గోస్వామితో జరిగిన చర్చ సందర్భంగా కంగన మాట్లాడుతూ పలు సంచలన విషయాలను బయటపెట్టారు. కంగన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నన్ను కొట్టడానికి వచ్చారు..
మహేష్ భట్ ఫ్యామిలీ నాకు ఇండస్ట్రీకి పరిచయం చేసింది నిజమే. నన్ను పరిచయం చేయడంలో మహేష్ భట్‌కు ఎలాంటి పాత్ర లేదు. అయినా ఆయన అంటే గౌరవమే. కానీ ఓ సినిమాను రిజెక్ట్ చేస్తే నన్ను కొట్టడానికి వచ్చాడు. నాకు ఓ కథ చెప్పినప్పుడు.. ముస్లిం మహిళ సూసైడ్ బాంబర్‌గా మారుతుందనే కథను రిజెక్ట్ చేశాను. మహిళ సూసైడ్ బాంబర్‌గా ఎందుకు మారాలి? ఆర్మీలోనూ, పోలీసులోనే చేరితే హీరోయిజం ఉంటుంది కాదా అంటే మహేష్ ఇగో దెబ్బతింది.

చెప్పు విసిరి నాపై దాడికి ప్రయత్నం
పూజాభట్, మహేష్ భట్ చెప్పిన కథను వ్యతిరేకించినందుకు నాపై అరిచారు. మహేష్ భట్ నన్ను కొట్టడానికి మీదుకు వచ్చాడు. నన్ను కొట్టడానికి నాపైకి వస్తే.. ఆయన కూతురు పూజాభట్ ఆపింది. ఎలాగోలా అక్కడి నుంచి బయటకు పారిపోయాను. ఆ తర్వాత అనురాగ్ బసు సినిమా కోసం వెళితే థియేటర్ మెయిట్ గేట్ వద్ద వెంటపడ్డారు. ఆ థియేటర్ వద్ద చెప్పుతో కొట్టాడు అని కంగన చెప్పారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆయనను తీసుకువెళ్లడంతో నా ప్రాణాలకు ముప్పు తప్పింది అని కంగనా అన్నారు.

భట్ ఫ్యామిలీ కోసం పూరీ సినిమా వదులుకొన్నా
మహేష్ భట్, ఆయన ఫ్యామిలీ మీద గౌరవం కారణంగానే నేను వేరే డైరెక్టర్లు ఆఫర్ చేసిన చాలా సినిమాలు వదులుకొన్నాను. మా వల్లనే నీ సినీ జీవితం అంటూ పూజాభట్ కామెంట్ చేయడాన్ని కంగన తప్పుపట్టారు. ఆ సమయంలో నేను రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. అందులో ఒకటి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించే పోకిరి. రెండోది అనురాగ్ బసు తీయబోయే గ్యాంగ్‌స్టర్ చిత్రం.

పోకిరి బ్లాక్‌బస్టర్ మూవీ
సౌత్ ఇండియాలో పూరీ జగన్నాథ్ చాలా పెద్ద డైరెక్టర్. చాలా బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఆయన ఆఫర్ చేసిన పోకిరి సినిమాను మహేష్ భట్ కోసం రిజెక్ట్ చేసి.. గ్యాంగ్‌స్టర్ సినిమాను ఒప్పుకొన్నాను. గ్యాంగ్‌స్టర్ సినిమాను కేవలం మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో చేసిన చిత్రంగా రూపొందించడంతో ఆ సినిమాను ఒప్పుకొన్నాను అని కంగన తెలిపారు. అయితే పోకిరి చిత్రం ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది. దాని వల్ల నేను కెరీర్ పరంగా నష్టపోయాను. దీంతో నాకు వాళ్లు చేసిన మేలు ఏంది అంటూ కంగన ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











