నాగ శౌర్య, హైబ్రిడ్ పిల్లకి మధ్య గ్యాప్..ఆ సినిమా మళ్ళీ.. !
ఆ మధ్యన నాగ శౌర్య.. సంచలన బ్యూటీ సాయి పల్లవి గురించి నేరుగా మీడియాలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరూ కణం అనే ద్విభాషా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. సెన్సార్ కార్యక్రమాలని సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనుకోని కారణాల వలన వాయిదాపడుతోంది.
Recommended Video


ఈ నెలలోనే విడుదల కావాల్సింది
కణం చిత్రం ఈ నెల 23 న విడుదల కావలసి ఉంది. కానీ ఏకంగా ఈ చిత్రాన్ని మార్చి 3 కు వాయిదా వేశారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా నటించారు.

సెన్సార్ కూడా కంప్లీట్
కణం చిత్రం సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకున్న తరువాత ఎందుకు వాయిదా పడుతోంది అనే విషయం తెలియడం లేదు.

సాయి పల్లవి, నాగ శౌర్య మధ్య గ్యాప్
ఇటీవల నాగ శౌర్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సాయి పల్లవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయి పల్లవి చుట్టూ వస్తున్న వివాదాలు వాస్తవమే అని వ్యాఖ్యానించారు. కణం చిత్రంతోనే వీరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఆలస్యంగా షూటింగులకు
సాయి పల్లవి షూటింగులకు ఆలస్యంగా వస్తుందని నాగ శౌర్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె చుట్టూ ఉన్న వివాదాలని గమనిస్తే నిజమే అని అనిపిస్తుందని నాగ శౌర్య అన్నాడు.


Click it and Unblock the Notifications











