twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kanchana 3 actress Alexandra Djavi మరణం వెనుక దారుణం.. రష్యా కాన్సులేట్ అనుమతి కోసం.. అసలేం జరిగిందంటే?

    |

    దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ రాఘవ మాస్టర్ దర్శకత్వంలో రూపొందిన కాంచన 3 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన రష్యన్ నటి అలెగ్జాండ్రా డావీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఉత్తర గోవాలోని ఓ ఇంటిలో రెంట్‌కు ఉన్న ఆమె ఆగస్టు 19వ తేదీన మరణించడం షాక్ గురిచేసింది. అయితే ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తడంతో గోవా పోలీసులు కేసును సీరియస్‌గా పరిగణిస్తున్నారు. అయితే అలెగ్జాండ్రా డావీ మరణం తర్వాత గోవా పోలీసులు వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

    కాంచన 3 చిత్రంలో దెయ్యం పాత్రలో

    కాంచన 3 చిత్రంలో దెయ్యం పాత్రలో


    రష్యాకు చెందిన అలెగ్జాండ్రా డావీ తమిళ భాషలో సినీ కెరీర్ కోసం ప్రయత్నించారు. కాంచన 3 చిత్రంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. కానీ అనుకొని పరిస్థితుల్లో లైంగిక వేధింపులకు గురి కావడంతో ఆమె గోవాకు తన మకాం మార్చారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన కాంచన 3తో ప్రతీకారం తీర్చుకొనే దెయ్యంగా నటించారు. ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఇలా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అందర్నీ విషాదానికి గురిచేస్తున్నది.

    అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని

    అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని

    ఉత్తర గోవాకు సంబంధించిన ఎస్ఐ మహేష్ జీ కేర్కర్ మీడియాకు అలెగ్జాండ్రా డావీ మృతిపై వెల్లడిస్తూ.. బెర్డేజ్ గోవా ప్రాంతంలోని గుబ్లావాడో‌లో అలెగ్జాండ్రా డావీ అద్దెకు ఉంటున్నారు. ఆమె ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించారు. ఆమె కాబోయే భర్త మోరిజిమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో తలుపులు తెరిచారు. అయితే ఆమె ఉరి వేసుకోవడంతో అప్పటికే మరణించారు అని తెలిపారు.

    రష్యన్ కాన్సులేట్ అనుమతి కోసం..

    రష్యన్ కాన్సులేట్ అనుమతి కోసం..

    అలెగ్జాండ్రా డావీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం స్థానికంగా సంచలనం రేపింది. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమె ఆత్మహత్యకు కారణమేమిటో తెలియరాలేదు. ఈ క్రమంలో రష్యన్ కాన్సులేట్ అధికారులను గోవా పోలీసు ఉన్నతాధికారులు సంప్రదించారు. వారి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. రష్యన్ కాన్సులేట్ అనుమతి వచ్చిన తర్వాత అలెగ్జాండ్రా డావీ పార్దీవ దేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తాం అని గోవా పోలీసులు పేర్కొన్నారు.

    చెన్నైలో లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్

    చెన్నైలో లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్


    గతంలో అంటే 2019లో అలెగ్జాండ్రా డావీ చెన్నైలో లైంగిక వేధింపులకు గురైంది. ఓ ఫోటోగ్రాఫర్ తన శారీరక కోరిక తీర్చాలంటూ వేధించారు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ కూడా చేశారు. ఆ నేపథ్యంలో వేధింపులకు పాల్పడిన ఫోటోగ్రాఫర్‌పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం అలెగ్జాండ్రా డావీ మరణించిన క్రమంలో గోవా పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేస్తారు. ఆమె మరణం వెనుక అనుమానాలు ఉన్నాయడంలో సందేహాలున్నాయి అని రష్యన్ కాన్సులేట్‌కు చెందిన లాయర్ విక్రమ్ వర్మ తెలిపారు.

    అలెగ్జాండ్రా డావి మరణంపై అనుమానాలు

    అలెగ్జాండ్రా డావి మరణంపై అనుమానాలు


    అలెగ్జాండ్రా డావీ మరణంతోపాటు మరో రష్యన్ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. యుక్త వయసులో ఉన్న మహిళ మరణిస్తే ఎన్నో అనుమానాలు తలెత్తడం సహజం. ఈ కేసులో కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తాయి. హత్యకు కూడా పాల్పడి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇలాంటి కేసులో హత్య చేసి కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ఛాన్స్ ఉంది. అందుకే ఇద్దరు రష్యన్ యువతులకు కాన్సులేట్ నుంచి అనుమతి తీసుకొన్న తర్వాత అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తాం. అలెగ్జాండ్రా డావీ మరణంలో ఏదో కుట్ర ఉందనే అనుమానం ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఉత్తర గోవా ఎస్పీ శోభిత్ సక్సేనా తెలిపారు.

    English summary
    Kanchana 3 actress Alexandra Djavi death: Goa police seeks Russian Consulate's permission for postmortem. Goa police waiting for to finish the Post mortem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X