Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాఘవ లారెన్స్ ‘కాంచన-3’ ట్విట్టర్ రివ్యూస్
Recommended Video
ముని, కాంచన, కాంచన 2 లాంటి హర్రర్ కామెడి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ తాజాగా 'కాంచన-3'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం, ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం కావడంతో ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సారి కూడా లారెన్స్ హిట్టు కొట్టినట్లేనా? ఆడియన్స్ ఏమంటున్నారు? ఓ లుక్కేద్దాం.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్
కాంచన-3 ఫస్టాఫ్ వీరలెవల్లో ఉంది. సెకండాఫ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
|
పైసా వసూల్ మూవీ
ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ డబుల్ మాస్. పైసా వసూల్ మూవీ. ఫ్యామిలీ, పిల్లలకు కూడా నచ్చుతుంది. రేటింగ్ 3.5/5
|
కాంచన అభిమానులు చూడాల్సిన మూవీ
సూపర్ మాస్ మూవీ. కాంచన, ముని అభిమానులు తప్పకుండా చూడాల్సిన మూవీ. కాంచన-4 కూడా రాబోతోంది.
|
ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ మమ మాస్
సినిమా ఫస్టాఫ్ మాస్, సెకండాఫ్ మమ మాస్. రాఘవ లారెన్స్ నుంచి మరో బ్లాక్ బస్టర్. నా రేటింగ్ 4/5
|
ఔట్ డేటెడ్ హారర్ కామెడీ
కాంచన-3 ఔట్ డేటెడ్ హారర్ కామెడీ. చాలా చోట్ల సినిమా ఇరిటేట్ చేసే విధంగా ఉంది. నేనిచ్చే రేటింగ్ 1.75/5.
|
ఫస్టాఫ్ హారర్ ఓ రేంజిలో
కాంచన-3 ఫర్వాలేదు. ఫ్యామిలీ, పిల్లలకు నచ్చుతుంది. ఫస్టాఫ్‌లో హారర్ సీన్స్ టాప్ రేంజిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని మాస్ సీన్లు భరించగలిగితే నచ్చుతుంది.
|
ఫస్టాఫ్ విషయంలో మాటలు లేవు
ఫస్టాఫ్ విషయంలో మాటలు లేవు. దారుణంగా భయపెట్టింది. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం.
|
మీరు కోరునే అన్నీ
మాస్, కామెడీ, హారర్, గ్లామర్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. కాంచన ఫ్రాంచైజీ నుంచి మీరు ఏమేం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉండేలా ప్లాన్ చేశారు. డైరెక్టర్ లారెన్స్ మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. ఫ్యామిలీ, పిల్లలకు కూడా నచ్చే విధంగా ఉంది.