కాంచన డైరెక్టర్ లారెన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూ ఎన్టీఆర్...!?
జూ ఎన్టీఆర్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'దమ్ము' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల తర్వాత లారెన్స్ తో ఎన్టీఆర్ ఓ భారీ చిత్రం చేస్తాడని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ముని చిత్రానికి స్వీక్వెల్ గా వచ్చిన కాంచన సినిమాను తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మించగా లారెన్స్ దర్శకత్వం వహించారు.
ఇటీవల 'కాంచన' చిత్రంతో తనలోనూ మంచి నటుడున్నాడని నిరూపించుకున్న రాఘవలారెన్స్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రెబల్' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత లారెన్స్ మరో భారీ చిత్రానికి కథ సిద్ధం చేశాడట. ఆ కథని ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడని, కథ నచ్చడంతో ఎన్టీఆర్ వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్ టైన్మెంట్ చిత్రమని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన సమాచారం త్వరలో అధికారికంగా వెలువడనుంది.


Click it and Unblock the Notifications











