రవితేజ, సునీల్ ని కూడా భయపెట్టిందిట
మామూలుగా హారర్ సినిమాలంటే ప్రేక్షకుడిని భయపెట్టేలా ఉంటాయి. కాంచన అందుకు పూర్తి భిన్నం. నవ్విస్తూనే భయపెట్టింది అంటున్నారు రవితేజ.ఆయన రీసెంట్ గా లారెన్స్ దర్సకత్వం వహించిన కాంచన చిత్రం చూసి ఇలా స్పందించారు.కాంచన చిత్రాన్ని శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీరాయ్ హీరోయిన్ గా చేసింది.
అలాగే సునీల్ మాట్లాడుతూ...'కాంచన చూసేప్పుడు ఏడెనిమది సార్లు భయపడ్డా...నన్నేకాదు..అందరినీ భయపెట్టిందీ సినిమా. భయపడుతూనే..నవ్వుల్ని పూయించిన సినిమా ఇది. శరత్‌కుమార్ పాత్ర కంటతడి పెట్టించింది. అత్తాకోడళ్లు దెయ్యం ఉందా..లేదా అని తెలుసుకునే సీన్‌లో నటన హైలైట్. క్లైమాక్స్ లో అయితే లారెన్స్ కాళికాదేవిని తలపించారు. సరికొత్త పంథాలో సినిమా తీసి విజయం సాధించిన దర్శకనిర్మాతలకు శుభాకాంక్షలు అన్నారు.


Click it and Unblock the Notifications











