twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రముఖి, అరుంధతి కలెక్షన్స్ బీట్ చేయనున్న ‘కాంచన’..!

    By Sindhu
    |

    'తెలుగులో 'బన్నీ" చిత్రం తర్వాత నేను చేసిన 'కాంచన" విజయం సాధించడం ఆనందంగా వుంది. నా వల్లే సినిమా విజయం సాధించిందని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. లారెన్స్ అందించిన పక్కా స్క్రీన్‌ ప్లే కారణంగానే ఈ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగింది. హారర్‌ తో పాటు కామెడీని మిక్స్ చేసి లారెన్స్ చాలా చక్కగా చిత్రాన్ని రూపొందించాడు. దర్శకులంతా ఫోన్ చేసి 'కాంచన"లో మీ నటన చూసి కళ్ళ నీళ్ళుపెట్టుకున్నాం అన్నారు. నా పాత్రకు ఇంత మంచి పేరు వస్తోందంటే అది లారెన్స్ గొప్పతనమే'అన్నారు శరత్‌కుమార్. ఆయన ప్రధాన పాత్రలో రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన".

    ఈ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌ లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ' ' కాంచన" విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించింది. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు భారీ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుండటం ఆనందంగా వుంది. అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా లారెన్స్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించారు. శరత్‌ కుమార్ పోషించిన పాత్రవల్లే 'కాంచన" ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

    ఈ చిత్రం ప్రస్తుతం 'చంద్రముఖి" కలెక్షన్స్ ని దాటి 'అరుంధతి" కలెక్షన్స్ ని క్రాస్ చేసే దశలో వుంది. సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుందన్నారు. రాఘవలాన్స్ మాట్లాడుతూ' ఈ చిత్ర కథని శరత్‌ కుమార్ కంటే ముందు ముగ్గురు హీరోలకు చెప్పాను వారు ఆలోచిస్తాం అన్నారు. కానీ శరత్‌ కుమార్ మాత్రం ఆలోచించకుండా కథ చెప్పగానే చేయడానికి ముందు కొచ్చారు'అని తెలిపారు.

    English summary
    Kanchana which released with superb collections, overpowering that of Nanna collections which had a star like Vikram in the lead, is getting good numbers from the weekdays too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X