twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేడీ నిర్మాత ఆవేదన... స్పందించిన కేటీఆర్, ఢిల్లీ వరకు వెళ్లిన మ్యాటర్, న్యాయం జరిగేనా?

    |

    తెలుగు మూవీ 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రానికి ఎన్నో ప్రశంసలు అందాయి. సామాజిక అంశాలను ఫోకస్ చేస్తూ రూపొందించిన ఒక మంచి చిత్రంగా కీర్తింపబడింది. అయితే ఈ మూవీ అమెరికా పౌరసత్వం ఉన్న ఎన్ఆర్ఐ నిర్మించడం వల్ల జాతీయ అవార్డు అర్హత కోల్పోయిందని కమిటీ వీరి అప్లికేషన్ తోసిపుచ్చింది.

    ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ఎన్ఆర్ఐ పరుచూరి విజయప్రవీణ ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, కేటీఆర్‌లను ట్యాగ్ చేసిన ఆమె.... వారిని నిలదీసే ప్రయత్నం చేశారు.

    అలాంటపుడు ‘మేక్ ఇన్ ఇండియా' ఎందుకు?

    కేరాఫ్ కంచరపాలెం భారతదేశంలో భారతీయులచే రూపొందించబడి, భారతీయులు నటించిన, భారతీయులచే ప్రశంసలు అందుకున్న చిత్రం. కేవలం ఒక కారణంతో జాతీయ అవార్డుకు అర్హత లేదు అంటున్నారు. అలాంటపుడు ‘మేక్ ఇన్ ఇండియా' ఎందుకు? అంటూ పరుచూరి విజయప్రవీణ ప్రశ్నించారు.

    స్పందించిన కేటీఆర్

    పరుచూరి విజయప్రవీణ చేసిన ట్వీట్ మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయ అవార్డు అనేది ప్రతి ఫిల్మ్ మేకర్‌ గర్వించే విషయం. పాతకాలం నాటి నిబంధన పేరుతో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని తిరస్కరించడం సరికాదు. ఈ విషయాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అరున్ జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లకు విన్నవించారు.

    కేటీఆర్ ట్వీటుతో ఢిల్లీ వరకు వెళ్లిన మ్యాటర్

    కేటీఆర్ ట్వీటుపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ఈ విషయమై అధికారులు నిర్మాత పరుచూరి విజయ ప్రవీణతో మాట్లాడినట్లు తెలిపారు. జాతీయ అవార్డుకు అప్లై చేసుకోవాలంటే నిర్మాత లేదా సహ నిర్మాత ఎవరైనా ఒకరు ఇండియన్ అయి ఉండాలనే నిబంధన ఉంది, దీనిపై సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

    కేరాఫ్ కంచరపాలెం

    కేరాఫ్ కంచరపాలెం

    2018లో వచ్చిన సినిమాల్లో హాట్ టాపిక్ అయిన మూవీ 'C/O కంచరపాలెం'. వైజాగ్ సమీపంలోని కంచర‌పాలెం అనే ఊరు నేప‌థ్యంతో భిన్నమైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించారు. న్యూయార్క్‌కు చెందిన ఎన్ఆర్ఐ కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మించారు. ఈ సినిమా బాగా నచ్చడంతో రానా దగ్గుబాటి తీసుకుని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేశారు.

    English summary
    "Dear Visionary Leaders ktrtrs ncbn narendramodi , #CareOfKancharapalem was made in India, by Indians, with Indians, released in India and appreciated by Indians, yet is not eligible for #nationalfilmawards. If this is the reason for ineligibility, Why makeinindia ??" c/o Kancharapalem producer tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X