For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘కంచె’ ఆడియో: రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లో గురువారం సాయంత్రం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు. రామ్ చరణ్ తో పాటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సింగితం శ్రీనివాస్, అల్లు అరవింద్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించారు.

  ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ డైరెక్టర్‌ను సినిమాలు చేయాలని అడగలేదు. కానీ నేను ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నాను. నేను, ప్రకాష్, రానా, క్రిష్ ఒక బ్యాచ్. ఒక రోజు క్రిష్ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్టు‌కి నేను సెట్ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్ తేజ్ తో తీసాడా? ఒక వేళ అదే కథని వరుణ్‌తో తీసి ఉంటే క్రిష్ అయిపోతాడు. ఈ కథ కోసం ఎన్నో నెలలు జార్జియాలో షూటింగ్ చేసారు. కెమెరామెన్ బాగా చేసారు. వరుణ్ హైట్ చూస్తుంటే నాకు అన్నయ్యలాగా ఉన్నాడు. మా ఫ్యామిలీలో మంచి అందగాడే కాదు, మంచి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు. నాక్కూడా అలాంటి గట్స్ రావాలి. క్రిష్‌కి కూడా అలాంటి గట్స్ నచ్చి నాతో సినిమా చేయాలి' అని వ్యాఖ్యానించారు.

  స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, వివరాలు...

  దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...

  దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...


  ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ ఎఫర్టె పెట్టి పని చేసారు. రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన ఈ సినిమాకు చింతన్ భట్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు.

  నాగబాబు మాట్లాడుతూ...

  నాగబాబు మాట్లాడుతూ...


  వరుణ్ తేజ్ ముకుందతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తను ఇంకా పేరు తెచ్చుకుంటే నిజమైన పుత్రోత్సాహం నాకు వస్తుంది. కంచె కథ చెప్పినపుడు 20 నిమిషాలు మాట్లాడలేక పోయాను. అందరిలాగే ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు.

  వరుణ్ తేజ్ మాట్లాడుతూ....

  వరుణ్ తేజ్ మాట్లాడుతూ....


  ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నా టీమ్ అందరికీ దన్యవాదాలు. పండగరోజు అందరూ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అభిమానులందరూ నా ప్యామిలీ. పెదనాన్న చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. మంచి సినిమా చేస్తున్నాను. నాన్న పరువు నిలబడెతాను. సినిమా విడుదలైన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చూపిస్తాను. సినిమా ఎలా ఉందని అడుగుతాను. అభిమానులు గర్వ పడేలా సినిమా ఉంటుంది. అన్నారు.

  సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ...

  సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ...


  నేను చెన్నైలో సంగీతం నేర్చుకున్నాను. తెలుగు సినిమా సంగీతం గురించి తెలుసు. గబ్బర్ సినిమాకు క్రిష్ తో కలిసి పని చేసాను. అతను చాలా ఇంటలిజెన్స్ డైరెక్టర్. ఇంత వండర్ ఫుల్ సినిమాకు ఛాన్స్ ఇచ్చినందుకు క్రిష్ కి ధన్యవాదాలు. తెలుగులో తొలి సినిమాకు సీతారామ శాస్త్రిగారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన రాసిన ఈ వేదమైనా ఎవ్వరి స్వేదమైనా పాట విన్నపుడు విస్మరించి పోయాను అన్నారు.

  సిరివెన్నెల మాట్లాడుతూ...

  సిరివెన్నెల మాట్లాడుతూ...


  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా మనల్ని 1945లోకి తీసుకెళ్తాయి. యుద్దంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేని కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం, ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపడం నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. వరుణ్ ని చూస్తుంటే హాలీవుడ్ నటున్నిచూసినట్లు ఉంది. రెండో సినిమాకే ఇలాంటి సినిమాలో అవకాశం దొరకడం అదృష్టం అన్నారు.

  English summary
  Telugu Movie Kanche Audio Launch event held at Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X