ఆకర్షిస్తున్న ‘కందిరీగ’డబ్బింగ్ గర్ల్
ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన 'కందిరీగ" సినిమా హీరోయిన్ అక్షకు కెరీర్ పరంగా ఎంత మేర లాభం చేకూర్చిందో తెలియదు కానీ...ఇందులో అక్షకు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి వాయిస్ మాత్రం అందరినీ కట్టిపడేస్తోంది. తెలంగాణ యాసతో ఆమె చెప్పిన డైలాగులు ఇతర దర్శకులను ఆకర్షిస్తోంది.
ఆ అమ్మాయి పేరు తేజస్విని. వయసు 18 సంవత్సరాలు. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేస్తోంది. ఇటీవల నంది అవార్డు అందుకున్న యువ గాయని ప్రణవికి తేజస్విని సోదరి. కందిరీగ సినిమా ద్వారా డబ్బింగ్ ఆర్టిస్టుగా పరిచమైన తేజస్వినిని ఇప్పడు వరుస అవకాశాలు వరిస్తున్నాయి. తనకున్న టాలెంట్ పరంగా తేజస్విని తెలుగు సినీ పరిశ్రమలో బీజీ డబ్బింగ్ ఆర్టిస్టుగా మారడం ఖాయం అంటూ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.


Click it and Unblock the Notifications











