‘రెడీ-2’అవుతుందంటున్నారు
రామ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం రెడీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ, హిందీ బాషల్లోకి కూడా రీమేక్ అయ్యి మంచి కలెక్షన్స్ సంపాదించింది. తాజాగా రామ్ చేస్తున్న కందిరీగ చిత్రం కూడా రెడీ రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. ఈ విషయమై రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని అటు క్లాస్ ఇటు మాస్‌ని ఆకట్టుకునేలా తీశాడు దర్శకుడు.ఈ కథలో అన్ని అంశాలు సంపూర్ణంగా ఉన్నాయి. నటనకు స్కోప్ ఉన్న పాత్రను రామ్ చేశాడు. రామ్ కెరీర్‌లో 'రెడీ" బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది 'రెడీ 2" అవుతుంది అన్నారు.
ఇక రామ్ మాట్లాడుతూ..కొన్ని సినిమాల్లో ఇంకాసేపు ఫైట్స్ ఉంటే బాగుంటుందనో లేక పాటలు ఉంటే బాగుంటుందనో అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఇంకాసేపు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆ స్థాయిలో ఈ సినిమా అలరిస్తుంది. అంత మంచి కథను ఎన్నుకున్నారు బెల్లంకొండ సురేష్. ఈ చిత్రంలో నేను బాగా చేసానంటే ఆ ఘనత దర్శకుడిది. ఫైట్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి"" అని చెప్పుకొచ్చాడు.
సంతోష్ శ్రీన్‌వాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్, హన్సిక, అక్ష కాంబినేషన్‌లో మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ" ఈ నెల 12న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్స్‌ని ఆవిష్కరించి ఇలా చెప్పుకొచ్చారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - ఇందులో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా చేశాడు. దర్శకుడు సినిమాని బాగా తీశాడు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











