మస్కాకొట్టే రామ్ తో కరుణాకరన్ సినిమా 'ఎందుకంటే...'..!?
ఇండస్ట్రీలో హీరోగా తన జోరు తగ్గిపోయినా ట్విట్టర్ లో మాత్రం ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చే రామ్ కి ఈసారి హిట్టొచ్చే సూచనలు కొంచెం కనిపిస్తున్నాయనేది ఇండస్ట్రీ టాక్..కొత్త డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ నేతృత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'కందిరీగ"అందర్నీ ఆకట్టుకునే హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందని ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు ఆ సినిమా యూనిట్ సభ్యులు..
అందులోనూ ఆల్ రెడీ తనోసారి 'మస్కా" కొట్టేసిన హన్సికను ఇందులో మరోసారి 'కందిరీగ"లా కుట్టేశాడట రామ్. దాంతో రామ్ హన్సికల రొమాన్స్ యూత్ ఆడియెన్స్ ను తప్పక రప్పిస్తుందనే కాన్ఫిడెన్స్ ఈ చిత్ర దర్శక నిర్మాతలలో బాగా కనిపిస్తోంది. కాగా 'కందిరీగ" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని జూన్ 30న గ్రాండ్ గా జరిపి సినిమాని జూలై 22న రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రింట్స్ తో, హయ్యస్ట్ థియేటర్స్ లో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు బెల్లంకొండ సురేష్.
కాగా 'కందిరీగ' సినిమా షూటింగుని పూర్తిచేస్తున్న యువ హీరో రామ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రేమ కథా చిత్రాల రూపకల్పనలో పేరు తెచ్చుకున్న కరుణాకరన్ ఇప్పుడీ చిత్రాన్ని కూడా వెరైటీ లవ్ స్టోరీగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అతనితో చేయడానికి రామ్ కూడా ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నెల 27 న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి ప్రోడ్యుస్ చేస్తారని వార్తలొచ్చినా, తాజాగా ఈ ప్రాజక్టును రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి 'ఎందుకంటే...' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











