twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దడ దెబ్బకి కాస్త ఉత్సాహంగా తీరుగుతోంది కందిరీగ

    By Sindhu
    |

    మొన్న దడ పుట్టించడంతో నిన్న కందిరీగ కూడా కుట్టేస్తుందేమో అనుకున్న ఆడియన్స్ సినిమా అయిపోయాక సరదాగా నవ్వుకుంటూనే బయటకు వచ్చారు. దడ కొట్టిన దెబ్బకు కందిరీగ కాస్త ఉత్సాహాన్ని తెచ్చింది. సాధారణంగా ఓ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసిన తరువాత ఏ నిర్మాత ఎక్కువ డబ్బులిచ్చి వెనక్కి తీసుకోడు. అలాంటి ఘటనలు అరుదుగానే జరుగుతాయి. సినిమా పై నిర్మాతకు ఏంతో నమ్మకం ఉంటే తప్ప అలా జరగదు.

    కందిరీగ విషయంలో మాత్రం అదే జరిగింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ కందిరీగను అలాగే కొన్ని ఏరియా రైట్స్ ను డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కొన్నారు. ఆయన నమ్మకం ఫలించింది. సినిమా హిట్. రోటీన్ కథ, రెడీ సినిమాని ప్రతి చోటా తలపించినా, అలా అలోచించుకోనివ్వకుండా ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే నడపడంలో కొత్త దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడు. సినిమా చూసి హాయగా నవ్వుకోవచ్చు. ఫస్ట్ అఫ్ లో హన్సిక అందం కనువిందు చేస్తే సెకండ్ అఫ్ లో అక్ష ఆకట్టుకుంది. విలన్ గా సీరియస్ డైలాగ్ లు చెబుతూనే సోను సూద్ చేసి కామెడి బాగుంది. బ్రహ్మానందంకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా రఘుబాబు, ఎం.ఎస్ నారాయణ, శ్రీనివాస రెడ్డి, జయప్రకాష్ రెడ్డి పరిధి మేరకు నవ్వించారు. రామ్ డ్యాన్స్ గుడ్. థమన్ సంగీతం ఓకే. మిగతా విభాగాలు కృషి సినిమా హిట్ లో ఉంది. ఓవరాల్ గా సినిమాలు లేవని బాధపడుతున్న ఫ్యామిలి ఆడియన్స్ వీకెండ్ లో కందిరీగను ఓసారి పలకరించవచ్చు అనే విధంగా ఉంది.

    English summary
    This is definitely a challenge for any film maker, to release his film, with a competition of other well known Hero’s film. But, seems like both the film makers of ‘Dhada’ and ‘Kandireega’ are much confident about the success of the films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X