షాకింగ్ నిజం :BMW కారు కోసమే, ప్రభాస్ తో కంగనా ఓకే
హైదరాబాద్: డబ్బు,కీర్తి కోసమే ఇండస్ట్రీలో ఏ హీరో,హీరోయిన్ లేదా, క్యారక్టర్ ఆర్టిస్ట్ నటిస్తున్నారు..కళ కోసం కాదు అనేది అక్షరాలా నిజం అని ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే అలాంటి కొన్ని నిజాలు అయినా వినటానికి విచిత్రంగా అనిపిస్తూంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చి టాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది.
అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ చిత్రంతోనే ప్రబాస్ కు డైలాగ్ డెలివరిలో పూర్తి స్దాయి ఈజ్ వచ్చిందంటారు ఆయన అభిమానులు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేయటానికి కారణం ఓ బిఎమ్ డబ్లూ కారు అని తెలుస్తే మీరు షాక్ అవుతారు.

దాదాపు ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఆమె మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ గుర్తు చేసుకుని మరీ మీడియాకు వివరించాడు. అతను బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... "అప్పట్లో మా నాన్నగారు నాకు ఓ బిఎమ్ డబ్లూ కారు గిప్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన కంగనా చాలా అసూయ ఫీలయ్యింది.
వెంటనే ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రం కమిటైంది. ఆ కారు కొనుక్కునే డబ్బు కోసం. ఆ డబ్బుతో వెంటనే బిఎమ్ డబ్లూ కొనుక్కుని నాకు చూపించింది. ఆమె అంత అసూయతో కూడిన హై టెంపర్ ఉన్న ఉన్న అమ్మాయి" అని తేల్చి చెప్పాడు.


Click it and Unblock the Notifications











