»   » కంగనా రనౌత్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందా?

కంగనా రనౌత్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందా?

Subscribe to Filmibeat Telugu

కంగనా రనౌత్ అందాలు చూస్తే రనవుట్ కావలసిందే ఎంత గొప్ప క్రికెటర్ అయినా. ఆమె వయసు ఇప్పటికీ నిండా 19 ఏళ్లే. చిన్నప్పుడు కాన్వెంట్ లో చదువుకుంటుండగా క్లాస్ రూమ్ లో ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందట. టీచర్ కు తెలియదనుకుని ఆమె చిప్స్ తింటూ టీచర్ దృష్టిలో పడింది. ఏం చేస్తున్నావంటే ఆమె అబద్దం చెప్పిందట.

అప్పుడు ఆ టీచర్ స్వామి వివేకానంద జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య సంఘటనలు చెప్పి అబద్దం ఆడకూడదని వివరించిందట. అప్పటి నుంచి కంగనా అబద్దం ఆడకూడదని (కొన్ని సందర్భాల్లో మినహా) నిర్ణయించుకుందట. మంచిదే కదా. ఆమె శాస్త్రీయ కథక్ నృత్య కళాకారిణి. అందువల్లనే ఆమెకు ఆ ఫిగర్ వచ్చిందని సినీ విమర్శకులు అంటూ ఉంటారు. ఆమె ఇప్పటివరకు తన తొలి బాలీవుడ్ సినిమా "గ్యాంగ స్టర్-ఎ లవ్ స్టోరీ" తో సంచలనం సృష్టించింది. ఆమెను బాలీవుడ్ లో మరో మాధురీ దీక్షిత్ గా ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ అభివర్ణించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu