బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌత్ హృతిక్ రోషన్ సొంత సినిమాలో బుక్కవటం ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేస్తోంది. నిజానికి ఆమె చేసినివి రెండు సినిమాలే(గ్యాంగస్టర్,మెట్రో). కాని అదరగొట్టే అంగాంగ విన్యాసాలు, హత్తుకుపోయే నటనతో అందరని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుంది.కాని ఆశించనంతగా ఆఫర్లు రాలేదు. పోష్ గా ఉంటుంది..నేటివిటి ఫ్లాబ్లమ్ అంటూ ఆమెను దర్శక,నిర్మాతలు దూరం పెట్టారు.ఈ లోగా మీడియా సృష్టించిన రకరకాల రూమర్లతో తడిసి ముద్దయింది.మరో పక్క రాంగ్ రీజన్స్ తో తొలిగింపబడ్డ డ్రైవర్ బయట కొత్త కథలు చెప్పుతూ అందరిని ఎంటరటైన్ చేయసాగాడు. ఇలా అందరి నోట్లో నానిన ఈ సుందరాంగికి సరైన టైమ్ వచ్చినట్లుంది.'కోయీ మిల్ గయా','క్రిష్ 'లతో తన తనయుడు హృతిక్ రోషన్ కెరీర్ కి కిక్కిచ్చిన రాకేష్ రోషన్ దృష్టిలో పడింది. దాంతో కంగనా రన్అవుట్ అని ఆమెను చూసి నవ్వుకున్నవాళ్ళందరూ ఇప్పడు అసూయ పడుతున్నారు. ఓరిస్తే ఓరుగల్లు మనదవుతుంది అంటే ఇదేనేమో.