»   »  సెక్సీగా కనిపిండం సాధికారత కాదు: కంగనా రనౌత్

సెక్సీగా కనిపిండం సాధికారత కాదు: కంగనా రనౌత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహిళ సాధికారత గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చింది. సెక్సీగా కనిపించినంత మాత్రాన మహిళా సాధికరత సాధ్యం కాదని, ఆ ప్రక్రియ నిదానంగా, క్రమ పద్ధతిలోనే సాధ్యమవుతుందని కౌంటర్ ఇచ్చింది. 'మహిళలు అభివృద్ధి చెందడమంటే మగవాళ్లను అణిచివేసినట్లు కాదు. పురుషులు స్త్రీలపట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటానికి మరో 20 ఏళ్లు పడుతుందని నా ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించింది. దీపిక పదుకోన్ ‘మై చాయిస్' వీడియో తాను ఇంకా చూడలేదని, మహిళ సాధికారత కోసం ఎవరి తోచినట్లు వారు ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయమే అని చెప్పుకొచ్చింది కంగనా.

Kangana Ranaut about women empowerment

దీపిక పదుకోన్ ‘మై చాయిస్' పేరుతో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. హోమి అదజనియా దర్శకత్వంలో రూపొందిన ఈ వీడియో దేశంలోని 99 మంది వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు భాగస్వామ్యం అయ్యారు. నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనేది పూర్తిగా నా ఇష్టం. నా వివాహం నాకు నచ్చినట్లు జరుగడమే కాదు..నా జీవితాన్ని పురుషుడితో పంచుకోవాలా? లేక స్త్రీతో పంచుకోవాలనేది కూడా పూర్తిగా నా ఇష్టం..అంటూ బాలీవుడ్ నటి దీపిక పదుక్ ఇటీవల మహిళా సాధికారత అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మై చాయిస్' పేరుతో ఈ వీడియో విడుదల చేసారు.

ఈ వీడియోపై ఇతర బాలీవుడ్ తారల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోనాక్షి సిన్హా కౌంటర్ ఇచ్చారు. ‘మహిళా సాధికారత అంటే....వివాహేతర సంబంధం, నచ్చిన విధంగా బట్టలేసుకోవడం, నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం లాంటివి కాదు. మహిళా సాధికారత అంటే.. మహిళల జీవన ప్రమాణాలు పెంచడం, వారికి ఉద్యోగాలు కల్పించడం, మానిసిక స్థైర్యం పెంచడం' అని స్పష్టం చేసింది. మహిళా సాధికారత ఎవరికి అవసరమో వారికి కల్పించాలి తప్ప విలాసాల్లో పుట్టిపెరిగిన తమలాంటివాళ్లకు కాదని స్పష్టం చేసింది.

English summary
Actress Kangana Ranaut says the video 'My Choice' must be appreciated for the effort towards promotion of women empowerment, but she is of the view that empowerment cannot happen by becoming sexists.
Please Wait while comments are loading...