సినిమాల్లోంచి పీకేసేవారు.. కానీ ఇలా జరగడం మొదటి సారి.. కంగన కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగన రనౌత్ బర్త్ డే నేడు (మార్చి 23). ఈక్రమంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తలైవి మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అందరికీ థ్యాంక్స్..
అసలు నేను మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు. నాకంత కొత్తగా ఉంది. నాకు ఈరోజు 34 ఏళ్లు నిండాయి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నా జీవితంతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని కంగనా అన్నారు. ఆ తరువాత తలైవి సినిమా గురించి కంగనా మాట్లాడారు.

మొదటి సారి అలా..
విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను రికమండ్ చేయకపోయి ఉంటే.. ఈ చాన్స్ వచ్చేది కాదు. నా జీవితంలో మొదటి సారి ఇలా ఒకరు రికమెండ్ చేశారు. మామూలుగా అయితే ప్రతీసారి నన్ను సినిమాల్లోంచి పీకేసేందుకు రికమండేషన్స్ జరుగుతుంటాయి. కానీ మొదటిసారిగా ఓ పాత్రకు నన్ను రికమండ్ చేశారు అని కంగనా ఎమోషనల్ అయింది.

డిజాస్టర్ అవుతుందని..
అయితే నేను ఈ పాత్రకు సరిపోతాను అని మీరు ఎలా అనుకున్నారు అని దర్శకుడు విజయ్‌ని అడిగాను. క్యాస్టింగ్ సరిగ్గా లేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుందని కూడా చెప్పాను. కానీ విజయ్ పట్టుబట్టి నన్ను ఒప్పించారు. ఈ సినిమా బృంద గారి వల్లే మొదలైంది. ఆమె లేకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని కంగనా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌లో కూడా..
అరవింద్ స్వామి గురించి మాట్లాడుతూ.. మామూలుగా మగవారు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. కానీ ఆచరణలో పెట్టరు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు సూపర్ స్టార్స్ ముందుకు రారు. కానీ అరవింద్ స్వామి లాంటి పెద్ద హీరోలు ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్. సూపర్ స్టార్స్ ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని.. బాలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను అని కంగనా తెలిపింది.
Recommended Video

అదిరిపోయిన ట్రైలర్..
ఇక తలైవి ట్రైలర్‌లో కంగనా తన నట విశ్వరూపాన్ని చూపించింది. అసెంబ్లీలో జయలలిత చీర లాగిన దృశ్యం తలైవి సినిమాకే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి డైలాగ్‌లు మాత్రం ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కంగనా తలైవిగా జీవించేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











