»   » మందు, సిగరెట్...బికినీలో హీరోయిన్ హల్‌చల్ (ఫోటోలు)

మందు, సిగరెట్...బికినీలో హీరోయిన్ హల్‌చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హాట్ అండ్ సెక్సీ అప్పియరెన్స్‌లో తనకు మరెవరూ సాటి రారంటూ ఓ మేగజైన్ కోసం రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. జిక్యూ అనే మేగజైన్ కోసం టూపీస్ బికినీ వేసి...మందు కొడుతూ, సిగరెట్ లాగిస్తూ కంగనా ఇచ్చిన హాట్ ఫోజులు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

బాలీవుడ్ పరిశ్రమలో అందాల ఆరబోత విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్ని నేపథ్యంలో ఆ పోటీని తట్టుకుని...తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కంగనా ఈ రేంజిలో రెచ్చిపోయిందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మధ్య వరుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాలీవుడ్లో దూసుకెలుతున్న కంగనా...పరిశ్రమలో బలంగా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.

మేగజైన్ కోసం కంగనా రనౌత్ ఇచ్చిన హాట్ ఫోటోలు, ఆమెకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

కంగనా రనౌత్

కంగనా రనౌత్

హిమాచల్ ప్రదేశ్‌లోని భంబ్లా అనే పట్టణంలో జన్మించిన కంగనా రనౌత్ మెడిసిన్ చేద్దామని అనుకుంది. అయితే ఆ తర్వాత మోడలింగ్ వైపు ఆకర్షితురాలైంది.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...

మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ వైపు సాగిన కంగనా రనౌత్ ‘గ్యాంగ్ స్టర్' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే అవార్డు

తొలి సినిమాతోనే అవార్డు

తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు గెలుచుకుంది కంగనా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది.

ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు

ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు

కంగనా రనౌత్ సినిమాల్లోకి రావడం వారికి ఇంట్లో వారికి ఇష్టం లేదు. కంగనా రనౌత్ ఫ్యామిలీ రాజ్‌పుత్ వంశానికి చెందిన వారు.

ఎదురించి...

ఎదురించి...

కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా మెడలింగ్, సినిమా రంగంలో అడుగు పెట్టిన కంగనా....తన మనసుకు నచ్చిన విధంగా జీవిస్తోంది.

గుర్తింపు తెచ్చిన సినిమాలు

గుర్తింపు తెచ్చిన సినిమాలు

బాలీవుడ్లో వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్', ‘ఫ్యాషన్', ‘తను వెడ్స్ మను', ‘క్వీన్' చిత్రాలలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఆమె ‘క్వీన్' చిత్రం పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

బాలీవుడ్లో టాప్ హీరోయిన్

బాలీవుడ్లో టాప్ హీరోయిన్

ప్రస్తుతం బాలీవుడ్లోని టాప్ 10 హీరోయిన్లలో ఒకరిగా కంగనా రనౌత్ తన హవా కొనసాగిస్తోంది.

తెలుగులో...

తెలుగులో...

తెలుగులో ‘ఏక్ నిరంజన్' చిత్రం ద్వారా అడుగుపెట్టిన కంగనా రనౌత్ ఆ సినిమా ప్లాపు కావడంతో మళ్లీ ఇటు వైపు చూడలేదు.

English summary
Bollywood actress Kangana Ranaut Bikini Photoshoot for GQ magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu