నా వ్యక్తిత్వాన్ని చంపి దారుణంగా....: దీపికకు మద్దతు ఇవ్వక పోవడంపై మౌనం వీడిన కంగనా!

By Bojja Kumar

'పద్మావతి' వివాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సెలబ్రిటీలు అంతా సినిమాకు సపోర్టు చేస్తున్నారు. ఈ చిత్ర హీరోయిన్ దీపిక పదుకోన్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని చంపుతామని బెదిరింపులు రావడంతో నటీనటులందరూ ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తున్నారు.

ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ దీపిక సేఫ్టీ కోసం మెంబరాఫ్ పార్లమెంట్ జయా బచ్చన్‌తో సహా, సినీ ప్రముఖుల చేత 'పద్మావతి'కి మద్దతుగా సంతకాలు చేయించి కేంద్రానికి ఓ పిటీషన్ అందజేసేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ పిటీషన్ మీద దాదాపు అందరు సినీ స్టార్స్ సంతకాలు చేసినప్పటికీ కంగనా రనౌత్‌ మాత్రం సంతకం చేయడాన్ని తిరస్కరించడం హాట్ టాపిక్ అయింది.

 కంగనా రనౌత్ పగతో ఇలా చేస్తోందా?

కంగనా రనౌత్ పగతో ఇలా చేస్తోందా?

దీపికకు మద్దతుగా ఉన్న ఈ పిటీషన్లో కంగనా రనౌత్ సంతకం చేయక పోవడంతో ఆమె దీపికపై పగతోనే ఇలా వ్యవహరిస్తోందంటూ ప్రచారం మొదలైంది. గతంలో హృతిక్ రోషన్ వివాదంలో దీపిక తనకు మద్దతు ఇవ్వక పోవడం వల్లే కంగనా ఇలా చేస్తోందని చర్చించుకున్నారు.

 అసలు కారణం చెప్పిన కంగనా

అసలు కారణం చెప్పిన కంగనా

తాను సంతకం చేయక పోవడానికి గల అసలు కారణం కంగనా రనౌత్ వెల్లడించారు. తనకు దీపికతో ఎలాంటి సమస్య లేదని, తాను సంతకం పెట్టక పోవడానికి కారణం షబానీ అజ్మీ అని కంగనా వెల్లడించారు.

 ఆమె చేసే రాజకీయాలు నచ్చలేదు

ఆమె చేసే రాజకీయాలు నచ్చలేదు

షబానీ అజ్మీ ఎప్పుడూ ‘లెఫ్ట్ వింగ్ వర్సెస్ రైట్ వింగ్' రాజకీయాలు చేస్తుందని, అందుకే ఆమెతో చాలా జాగత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను ఆ పిటీషన్ మీద సంతకం చేయలేదని కంగనా రనౌత్ తెలిపారు. హృతిక్ రోషన్ వివాదం సందర్భంగా షబానా తనకు వ్యతిరేకంగా చేసిన పనులను ఈ సందర్భంగా కంగనా ప్రస్తావించారు. ఆ సమయంలో నా వ్యక్తిత్వాన్ని చంపే విధంగా ఆమె దారుణంగా ప్రవర్తించారని తెలిపారు.

 దీపికకు నా పూర్తి మద్దతు ఉంటుంది

దీపికకు నా పూర్తి మద్దతు ఉంటుంది

జోధ్‌పూర్‌లో తాను మణికర్ణిక సినిమా షూటింగులో ఉన్న సమయంలో నా ప్రియమైన స్నేహితురాలు అనుష్క శర్మ నుండి ఈ పిటీషన్ మీద సంతకం చేయాలని ఫోన్ వచ్చిందని, దీపికకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపాను, అయితే షబానీ అజ్మీ పాలిటిక్స్ తో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె నాయకత్వంలో సంతకాల సేకరణ జరుగుతున్న ఈ పిటీషన్ మీద సంతకం చేయలేదని చెప్పాను, అనుష్క విషయం అర్థం చేసుకుందని కంగనా తెలిపారు.

 దేశంలోని పరిస్థితులపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

దేశంలోని పరిస్థితులపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రస్తుతం మన దేశంలో నెలకొన్ని పరిస్థితులపై నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఐడియాలు ఉన్నాయి. ‘పద్మావతి' విషయంలో తాను దీపికకు పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని కంగనా చెప్పారు.

 ‘పద్మావతి' వివాదంపై పూర్తి వివరాలు

‘పద్మావతి' వివాదంపై పూర్తి వివరాలు

‘పద్మావతి' వివాదానికి సంబంధించిన పూర్తి వివాదాలు, పార్లమెంట్ ప్లానెల్‌ సమావేశంలో ఈ వివాదంపై దర్శకుడి వాదనలకు సంబంధించిన

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X