For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కంగన రనౌత్ ఇంటి వద్ద కాల్పులు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వివాదమే కారణమా?

  |

  బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇంటి వద్ద కాల్పుల ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం తన సొంత పట్టణం మనాలీలో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కాల్పుల ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

  మనాలీలోని కంగన ఇంటి వద్ద కాల్పులు

  మనాలీలోని కంగన ఇంటి వద్ద కాల్పులు

  కంగన రనౌత్ శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి నా ఇంటికి సమీపంలో తుపాకీ గుళ్లు పేల్చిన శబ్దం వినిపించాయి. ఈ క్రమంలో నా ప్రాణభయం ఏర్పడింది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో హుటాహుటిన కులూ జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు, సోదాలు నిర్వహించిన అనంతరం కొంతమంది సిబ్బందిని సెక్యూరిటీగా నియమించారు.

  కాల్పుల ఘటనపై కంగన వివరణ ఇస్తూ

  కాల్పుల ఘటనపై కంగన వివరణ ఇస్తూ

  కాల్పుల ఘటనపై కంగన రనౌత్ వెల్లడిస్తూ.. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో నేను బెడ్‌రూంలో ఉన్నాను. మా ఇంటికి ప్రహారీ గోడకు సమీపంలో యాపిల్ చెట్లు, చెరువు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి టపాసులు పేలినట్టు భారీగా శబ్దం వినిపించింది. తొలుత టపాసులు అనుకొన్నాను. కానీ రెండోసారి తుపాకి పేలిన శబ్దం లాంటిది వినిపించింది. దాంతో నా సెక్యూరిటీ పిలిచి అప్రమత్తం చేశాను.

  యాపిల్ తోటలో కాల్పులు ఏవైనా

  యాపిల్ తోటలో కాల్పులు ఏవైనా

  తన ఇంటికి సమీపంలోని యాపిల్ తోటలో గబ్బిలాలకు చంపేందుకు ఎవరైనా భూస్వాములు శబ్దం చేసి ఉంటారనే అనుమానాన్ని నా సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. కానీ నాతో ఇంట్లో ఐదురుగు సభ్యులు కూడా బుల్లెట్ శబ్దాలే అనే ధృవీకరించారు. ఎనిమిది సెకన్ల సమయంలోనే రెండుసార్లు ఆ శబ్దాలు వినిపించాయి. దాంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని కంగన రనౌత్ మీడియాకు వెల్లడించారు.

  నన్ను బెదిరించడానికే కాల్పులు..

  నన్ను బెదిరించడానికే కాల్పులు..

  కొద్దికాలంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నాను. ఆ క్రమంలో నన్ను బెదిరించడానికి ఎవరో ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారనే అనుమానం కలుగుతున్నది. నన్ను బెదిరించడానికి స్థానికుల్లో కొందరిని నియమించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు, ఎనిమిది వేలు ఇస్తే చంపడానికి కూడా ఇక్కడి వారు సిద్దంగా ఉంటారు అని కంగన పేర్కొన్నారు.

  సీఎం కొడుకుతో ఇదే విషయాన్ని చర్చించాను

  సీఎం కొడుకుతో ఇదే విషయాన్ని చర్చించాను

  హిమాచల్ ప్రదేశ్ సీఎం కొడుకుతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పాను. ముంబైలో అలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కానీ నేను ముంబైలో లేను. అలా అనుకొన్న కొద్ది రోజుల్లోనే కాల్పుల శబ్దాలు నిజంగానే వినిపించాయి. ఇలానే సుశాంత్‌ను కూడా భయభ్రాంతులకు గురిచేసి ఉన్నారేమో అనే సందేహాలను కంగన రనౌత్ వ్యక్తం చేశారు.

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
  కంగన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు

  కంగన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు

  కంగన రనౌత్ ఫిర్యాదుతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి చోటుచేసుకొన్న శబ్దాలు తుపాకీ పేల్చిన శబ్దాలేనానే కోణంలో ఆ ప్రాంతంలోని స్థానికులను విచారిస్తున్నారు. మనాలీకి వచ్చిన వెహికిల్స్‌ను, అనుమానాస్పంద వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే వారిని విచారిస్తున్నాం అని స్థానిక పోలీసుల అధికారి వెల్లడించారు.

  English summary
  Bollywood actress Kangana Ranaut complaints Gun firing at her Manali residence. She said, I was in my bedroom, at about 11.30 pm. We have three floors. We have a boundary wall, behind which there are apple orchards and a water body. I heard a cracker-like sound at 11.30.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X