For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోజుకో హాట్ అమ్మాయి వాళ్లతో గడపాల్సిందే.. రూమ్ డోర్ లాక్ చేసి.. నాకు అలాంటి అనుభవం.. కంగన

  |

  బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ను మరోసారి కుదిపేశాయి. గతంలో మీటూ కాలంలో పలువురు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడం తెలిసిందే. ఇటీవల కాలంలో బాలీవుడ్ దర్శకులపై కంగన రనౌత్‌తోపాటు పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేస్తున్న క్రమంలో పాయల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై వరుస ట్వీట్లతో కంగన చేసిన ఆరోపణలు ఏమిటంటే..

  ఆఫర్ ఇస్తానని ఇంటికి పిలిచి

  ఆఫర్ ఇస్తానని ఇంటికి పిలిచి

  ఆఫర్ ఇస్తాననే ఆశ చూపి తనను లైంగిక వేధించాడు. నాతో దారుణంగా, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన గది నుంచి తప్పించుకొని వచ్చాను. మరుసటి రోజు నాకు ఫోన్ మెసేజ్ చేసి బాలీవుడ్‌లో ఇలాంటివి సాధారణమే. శారీరక సంబంధాలు కామన్ అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అని ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఖండించారు.

  మహిళలను వంచించడంలో అనురాగ్ కశ్యప్ సిద్ధహస్తుడు

  మహిళలను వంచించడంలో అనురాగ్ కశ్యప్ సిద్ధహస్తుడు

  అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యల నేపథ్యంలో కంగన వరుస ట్వీట్లు చేశారు. పాయల్ ఘోష్ చెప్పిన విషయాలు చేయడంలో అనురాగ్ సిద్ధహస్తుడు. తన జీవిత భాగస్వాములను మోసం చేశాడు. సొంత భార్యలకు అన్యాయం చేశాడు. మహిళలను వంచించే రక్తపిపాసి. మీటూలో కూరుకుపోయి నాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి గుణపాఠం చెబుతాను. పాయల్‌కు మద్దతు ఇస్తాను. అని కంగన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

   ఒక్క భార్యతో సరిపెట్టుకోకుండా..

  ఒక్క భార్యతో సరిపెట్టుకోకుండా..

  అనురాగ్ కశ్యప్ ప్రవర్తన గురించి నాకు తెలుసు. ఒకే భార్యకు పరిమితం కాకుండా పలువురిని పెళ్లాడాడు. శారీరక సంబంధాలు బుల్లీవుడ్‌లో సాధారణమని చెప్పడమే ఆయన వ్యవహారం తెలుస్తున్నది. కొత్తగా కెరీర్ కోసం సినీ పరిశ్రమకు వచ్చే అమ్మాయిలను సెక్స్ వర్కర్ల కంటే దారుణంగా చూస్తున్నారు. అనురాగ్ కశ్యప్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి అని కంగన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

  భూటకపు పెళ్లిళ్లతో అమ్మాయిలకు మోసం

  భూటకపు పెళ్లిళ్లతో అమ్మాయిలకు మోసం

  బాలీవుడ్‌పై సెటైర్లు వేస్తూ.. బుల్లీవుడ్‌లో మహిళలను వంచించే వాళ్లు చాలా మందే ఉన్నారు. భూటకపు పెళ్లిళ్లతో మోసం చేస్తుంటారు. ప్రతీ రోజు ఒక హాట్ అమ్మాయి వాళ్లను తృప్తి పరచాల్సిందే. ఇలాంటి విషయాలను ఇప్పటికే చాలా ప్రస్తావించాను. పాయల్ ఘోష్ లాంటి మీటూ ఉద్యమానికి నేను మద్దతుగా నిలుస్తున్నాను అని కంగన రనౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

   నాకు పాయల్ ఘోష్ లాంటి అనుభవాలు

  నాకు పాయల్ ఘోష్ లాంటి అనుభవాలు

  పాయల్ ఘోష్ ఎలాంటి ఆరోపణలు చేసిందో అలాంటివి సంఘటనలు పెద్ద హీరోలతో జరిగాయి. సడెన్‌గా వ్యాన్ లేదా రూమ్ డోర్‌ లాక్ చేసి దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పార్టీలో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ డ్యాన్స్ ఫ్లోర్‌పైనే వాళ్ల నాలుకను ఇతరుల నోట్లో పెట్టేస్తారు. ఆఫర్ల పేరుతో ఇంటికి పిలిచి అత్యాచారాయత్నాలు చేస్తారు అని కంగన దారుణమైన ట్వీట్లు చేశారు.

  English summary
  Bollywood actress Kangana Ranaut demands Anurag Kashyap to arrest in Payal Ghosh. She made serial tweets on Anurag and criticise bollywood Industry big wiggs. She tweeted that Bullywood is full of sexual predators who have fake and dummy marriages they expect a new hot young girl to make them happy everyday, they do the same to young vulnerable men also,I have settled my scores my way I don’t need #MeToo but most girls do #PayalGhosh #AnuragKashyap
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X