twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకురాలిగా మారిన ప్రభాస్ హీరోయిన్

    By Bojja Kumar
    |

    ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గుర్తుందా? బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించుకున్నారు కంగనా రనౌత్. సాధారణంగా తాగి పడిపోయే లేడి క్యారెక్టర్స్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కంగనా రనౌత్ మాత్రమే. దానికి కారణం లేకపోలేదు గతంలో వచ్చినటువంటి చాలా సినిమాలలో కంగనా రనౌత్ అలాంటి పాత్రలను పోషించడం జరిగింది. ముఖ్యంగా మనం ష్యాషన్ అనే సినిమాలో కంగనా రనౌత్ చేసినటువంటి యాక్షన్ గనుక చూసినట్లైతే ఆమె నటనకు వావ్ అనని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నమ్మశఖ్యం కాదు.

    తాజాగా ఈ భామ దర్శకత్వం వైపు అడుగు పెట్టింది. ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా కంగనా దర్శకురాలి అవతారం ఎత్తబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఈ లఘు చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అంతా అమెరికన్లే నటించారు. ఒక కుక్క, నాలుగేళ్ల బాలుడు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చైల్డ్ సైకాలజీ నేపథ్యంలో ఈ షార్ట్ ఫల్మ్ ఉంటుందని సమాచారం. టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు అమ్మడు దాదాపు ఆరు నెలలు గ్రౌండ్ వర్క్ చేసిందట.

    ఈ లఘు చిత్రం గురించి కంగనా మాట్లాడుతూ...పిల్లలతో, జంతువులతో సినిమాలు తీయడం చాలా కష్టం. వాళ్లతో సినిమాలు తీయకూడదనే నేను అడ్వైజ్ ఇస్తా. కానీ నా స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టి నాకు తప్పలేదు. రహస్యంగా కెమెరాలు పెట్టి లిటిల్ బాయ్‌తో సినిమా తీశాం. అతన్ని ఆడిస్తూ షూటింగ్ జరుపుతూ చాలా కష్ట పడ్డాం, కుక్క అప్పటికే ట్రైనింగ్ అయి ఉంది కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు అని చెప్పింది.

    English summary
    Kangna Ranaut directorial debut is a short film. Kangna said that the decision to direct was well thought out and came to light "after meeting Hollywood biggies during one of my recent trips to Los Angeles. And things just fell into place. "Kangna wanted to be well prepared and held plenty of workshops and also delved a bit into child psychology to help connect with the character of the kid in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X