»   » సెక్సువల్‌గా వేధించాడు, రక్తం వచ్చేలా కొట్టాడు: కంగన

సెక్సువల్‌గా వేధించాడు, రక్తం వచ్చేలా కొట్టాడు: కంగన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ కెరీర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడిందో ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సెక్సువల్‌గా వేధింపులు ఎదుర్కొన్నానని, దాడి కూడా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ బుక్ ‘ది అన్ క్వైట్ ఇండియా' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసారు.

నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో... నాకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు ఓ సెలబ్రిటీ నన్ను సెక్సువల్‌గా వేధించాడు. నా తలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగింది. ఆ సెలబ్రిటీకి నా తండ్రి వయసు ఉంటుంది. ఈ విషయమై అప్పట్లో నేను పోలీసులకు ఫిర్యాదు చేసినా.... అతనికి సమాజంలో బాగా పలుకుబడి ఉండటంతో కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారు అని తెలిపారు. అయితే ఆ సెలబ్రిటీ ఎవరు? అనే విషయం మాత్రం కంగన రనౌత్ బయట పెట్టలేదు.

Kangana Ranaut faced Physical Abuse!

ఎవరి అండ లేకుండా సినిమా రంగంలో ఎదిగిన హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి సంవత్సరాలు ఆమె దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే క్రమ క్రమంగా మంచి అవకాశాలు రావడం, హిట్స్ తన ఖాతాలో పడటంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కంగనా రనౌత్ కెరీర్లో బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘క్వీన్'. ఈ సినిమాలో నటనకు ఆమె ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ‘తను వెడ్స్ మను రిటర్న్స్' కూడా కెరీర్లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

English summary
Kangana Ranaut spoke about being physically abused by a Celebrity from the Industry during her struggling days. She made this revelation during the launch of Journalist Barkha Dutt's book 'The Unquiet India'. The 'Tanu Weds Manu Returns' Actress revealed that she was sexually harassed by a celebrity at the age of 17.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu