»   » మగాడికి సెక్స్ వినోదం.. కానీ ఆడదానికి మాత్రం నరకం.. పురుషులంటే అసహ్యం.. కంగన

మగాడికి సెక్స్ వినోదం.. కానీ ఆడదానికి మాత్రం నరకం.. పురుషులంటే అసహ్యం.. కంగన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమలో మహిళలను చాలా నీచంగా చూస్తారంటూ ధ్వజమెత్తుతున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోసారి పురుషాధిక్యతపై విరుచుకుపడింది. శృంగారం విషయంలో మగవాళ్ల ప్రవర్తను ఎండగట్టింది. బాలీవుడ్‌లో బంధుప్రీతిపై వ్యాఖ్యలు చేసి వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖుల మధ్య హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కంగన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో కంగన దుమారం..

బాలీవుడ్‌లో కంగన దుమారం..

ఇటీవల కాలంలో మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన చిత్రాల ప్రమోషన్ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని చేసిన విమర్శలను కంగన సమర్ధంగా తిప్పికొడుతున్నారు. బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, బంధుప్రీతిపై ఇటీవల వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించడం తెలిసిందే.

పురుషులంటే అసహ్యం..

పురుషులంటే అసహ్యం..

నేను మగాళ్లు అంటే ఒళ్లు మంట. నేను పురుషులను ద్వేషిస్తాను. సినీ పరిశ్రమలో పురుషులదే ఆధిపత్యం. మహిళలను చిన్నచూపు చూస్తారు అంటూ ఇటీవల మీడియాలో ధ్వజమెత్తారు. పరిశ్రమలో బంధుప్రీతి బలంగా పేరుకుపోయింది. దానిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదో ఒకటి ఆశిస్తారు..

ఏదో ఒకటి ఆశిస్తారు..

బాలీవుడ్‌లో ఆడవాళ్ల నుంచి మగాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తుంటారు. వారి శారీరక సంబంధాలన్నీ తాత్కాలికమే. సెక్స్ అనుభవించడం మగాళ్లకు అదో వినోదం. కానీ మహిళలకు చెప్పలేనంత నరకం. అదో నేరంగా భావిస్తారు. గ్లామర్ ప్రపంచంలో అందరికీ అలాంటి అభిప్రాయమే ఉంది అని కంగన అన్నారు.

కూతుళ్లు బికినీ వేసుకొంటే..

కూతుళ్లు బికినీ వేసుకొంటే..

సినీ పరిశ్రమలో ప్రముఖుల తీరు చాలా దారుణంగా ఉంటుంది. జులాయిగా తిరిగే తన కుమారులను దర్జాగా వారసులుగా పరిశ్రమకు పరిచయం చేస్తారు. కానీ తమ కుమార్తెల విషయానికి వచ్చే సరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. వారి కూతుళ్లు బికినీ వేసుకొంటే ప్రాణం పోతుంది. తమ ప్రతిష్ట గంగలో కలిసిందని బాధపడుతారు. వేరే అమ్మాయిలను మాత్రం చాలా నీచంగా చూస్తారు.

కుమారుల వెంట బికినీ..

కుమారుల వెంట బికినీ..

ఇక సినీ ప్రముఖులు తన కుమారుడి చుట్టు పదుల సంఖ్యలో బికినీ వేసుకొన్న అమ్మాయిలు ఉంటే మాత్రం తెగ సంబరపడిపోతారు. అమ్మాయిలు మాత్రం వారి ఫ్యూడల్ విధానాలకు బలికావాల్సిందే అని కంగన ఫైర్ అయ్యారు

సిమ్రన్‌కు మంచి స్పందన

సిమ్రన్‌కు మంచి స్పందన

కంగన రనౌత్ నటించిన తాజా చిత్రం సిమ్రన్ గతవారం విడుదలైంది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కంగన నటనకు మంచి పేరు వస్తున్నది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.10.65 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

English summary
Kangana Ranaut is one actor who does not believe in being diplomatic. She has been vocal about sexism and nepotism in the industry, and has minced no words in criticising the fragility of male egos. She said, Having sex is fun for a man, but for a woman, it's almost criminal. Men brag about their Casanova sons, but when it comes to their daughters, she can't be wearing a bikini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu